Sunday, October 6, 2024

పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల్లో కోర్టు తీర్పుపై తాము నిబంధనల ప్రకారం నడుచుకుంటామని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. తాను తీసుకునే నిర్ణయం రాబోయే కాలంలో తెలుస్తుందని చెప్పినట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్‌ఎస్, బీజేపీలు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది.

ఒకవేళ చర్యలు తీసుకోకుంటే సుమోటోగా తీసుకుంటాని కోర్టు తెలిపింది. కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందించారు. పార్టీ ఫిరాయింపుల కేసు కోర్టు పరిధిలో ఉందని, పార్టీ మారిన వారిపై చర్యలకు కోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చిందన్నారు. కాగా స్పీకర్ తీసుకునే నిర్ణయంపై పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు ఆయన అనుచరులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News