Thursday, May 2, 2024

సంప్రదాయాన్ని మార్చిన పోచారం విజయం

- Advertisement -
- Advertisement -

స్పీకర్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన గెలుపు

విజయం సాధించిన పోచారం శ్రీనివాసరెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్ సెంటిమెంట్‌కు బ్రేక్ పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా స్పీకర్‌గా పని చేసిన మధుసూదనాచారి, కిరణ్‌కుమార్‌ రెడ్డి, నాదేండ్ల మనోహర్, సురేష్‌ రెడ్డి , ప్రతిభా భారతి తదితరులు ఓడిపోయారు. తొలిసారిగా ఆ చరిత్రను తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి తిరగ రాశారు. బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి సమీప ప్రత్యర్థి కాంగ్రేస్ అభ్యర్థిపై 23582 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గత తెలంగాణ ఎన్నికలలో భూపాలపల్లి నుంచి పోటీ చేసిన అప్పటి స్పీకర్ మధుసూదనాచారి కాంగ్రెస్ నాయకుడు గండ్ర వెంకటరమణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ సెంటిమెంటుకు భయపడే గత స్పీకర్ మధుసూధనాచారి తన నియోజకవర్గంలో నిత్యం క్యాడర్‌తో ఉంటూ విపరీతంగా పర్యటించినా కూడా ఫలితం దక్కలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News