Tuesday, October 15, 2024

సిద్దరామయ్యపై దర్యాప్తు చేపట్టండి

- Advertisement -
- Advertisement -

మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ(ముడా) భూ కేటాయింపు కేసులో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై దర్యాప్తు చేయవలసిందిగా లోకాయుక్త పోలీసులను బెంగళూరు ప్రత్యేక కోర్టు బుధవారం ఆదేశించింది. సిద్దరామయ్య భార్య బిఎం పార్వతికి ముడా 14 స్థలాలను చట్టవిరుద్ధంగా కేటాయించిందంటూ వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి మంజూరు చేయడాన్ని సమర్థిస్తూ

కర్నాటక హైకోర్టు మంగళవారం తీర్పును వెలువరించిన నేపథ్యంలో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ బుధవారం ఈ ఉత్తర్వులు జారీచేశారు. ఆర్‌టిఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టవలసిందిగా మైసూరులోని లోకాయుక్త పోలీసులను అవినీతి కేసులు, ఎంపి, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులను ప్రత్యేకంగా విచారించే ప్రత్యేక కోర్టు ఆదేశించింది. డిసెంబర్ 24వ తేదీలోగా దర్యాప్తు నివేదికను దాఖలు చేయాలని కూడా లోకాయుక్త పోలీసులను కోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News