Saturday, April 27, 2024

దీపావళి పండగకు సికింద్రాబాద్ – రాక్సోల్ మధ్య ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : దీపావళి , ఛత్ పూజ పండుగలకు ప్రయాణీకుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ మేరకు సికింద్రాబాద్ రాక్సోల్ – సికింద్రాబాద్‌ల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ జనసాధరన్ ప్రత్యేక రైళ్లలో 22 అన్ రిజర్వ్‌డ్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. దాదాపు 2, 400 మంది ప్రయాణీకులు కూర్చునేలా సీటింగ్ వసతిని ఉంటోంది. ఛార్జీలు కూడా ఇతర ప్రయాణ సాధనాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. ఈ జనసాధరన్ రైళ్లు ప్రయాణికులు తమ ప్రయాణాలను తక్కువ సమయంలో ప్లాన్ చేసుకునే అత్యంత సరసమైన రవాణా సదుపాయం కావడం గమనార్హం. రోడ్డు రవాణా మార్గంతో పోలిస్తే జనసాధరన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణ ఛార్జీలు సుమారు 50 శాతం తక్కువగా ఉండడమే కాకుండా పండుగకు అలాగే తిరుగు ప్రయాణాలను అందించనుంది. తద్వారా ఆ రైళ్లు సామాన్య ప్రజల అంచనాలకు అనుగుణంగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు.

ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుండి కామారెడ్డి, నిజామాబాద్ , బాసర , ముద్ఖేడ్ , నాందేడ్ మీదుగా పూర్ణ తదితర దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉపయోగకరంగా ఉండనుంది. సికింద్రాబాద్ – రాక్సోల్‌కు ఈ ఆదివారం ఉదయం 10.30 కు, అలాగే మంగళవారం సాయంత్రం 6.00 గంటలకు బయలుదేరి వెళ్లనుంది. తిరుగు ప్రయాణంలో రాక్సోల్ నుంచి సికింద్రాబాద్‌కు మంగళవారం సాయంత్రం 7.15కు , అలాగే గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి రానుంది. ఈ జనసాధరన్ ప్రత్యేక రైళ్లకు బోల్లారం , మేడ్చల్ , అక్కన్నపేట్ , కామారెడ్డి , నిజామాబాద్ , బాసర , ముద్ఖేడ్ , నాందేడ్ , పూర్ణ , బాస్మత్ , హింగోలి దక్కన్ , వాషిం , అకోలా , ఖాండ్వా , ఇటార్సీ, పిపారియా, జబల్పూర్, సీతామర్హి జంక్షన్ స్టేషన్ లలో ఇరువైపు ప్రయాణాలో ఆగనుంది. జనసాధరన్ ప్రత్యేక రైళ్లలో ప్రయాణించాలనుకునే ప్రయాణీకులు అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ మొబైల్ యాప్ (యూ. టీ. ఎస్ మొబైల్) ద్వారా టిక్కెట్‌లను కొనుగోలు చేయడం ద్వారా అన్‌రిజర్వ్‌డ్ జనరల్ బుకింగ్ కౌంటర్‌లలో రద్దీని నివారించవచ్చునని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News