Monday, April 29, 2024

ప్రపంచమంతటా పురుషులలో పడిపోతున్న స్పెర్మ్ కౌంట్!

- Advertisement -
- Advertisement -

పురుషుల్లో ఏకంగా 62 శాతం తగ్గిన స్పెర్మ్ కౌంట్

స్పెర్మ్ నాణ్యత కూడా 51 శాతానికి పడిపోయిందన్న పరిశోధకులు

పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా చాలా మంది తల్లిదండ్రులు కాలేకపోతున్నారు.  దీనికి కారణం పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడమేనని తాజా సర్వే ఒకటి తేల్చింది. భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా 53 దేశాలకు చెందిన పురుషులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని హ్యూమన్ రీప్రొడక్షన్ సంస్థ తాజా సర్వేలో తేలింది. ఈమేరకు 1973 నుంచి 2018 మధ్య కాలంలో 223 పత్రికలు, మ్యాగజైన్స్ కథనాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించినట్లు ‘హ్యూమన్ రీ ప్రొడక్షన్ సంస్థ’ వెల్లడించింది.

కౌంట్ పడిపోవడమే కాదు, నాణ్యత కూడా తగ్గిందని ఈ సంస్థ తెలిపింది. కౌంట్ విషయానికి వస్తే 62.3 శాతానికి తగ్గగా.. నాణ్యత 51.6 శాతానికి పడిపోయిందని వెల్లడించింది. 53 దేశాలకు చెందిన 57 వేల మంది పురుషుల నుంచి సేకరించిన శాంపిల్స్ ను పరీక్షించి ఈ వివరాలను కనుగొన్నట్లు తెలిపింది. దీనికి పలు కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైంది జీవనశైలిలో మార్పులేనని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి, టెన్షన్, ఆహారం.. తదితరాలు అన్నీ కలిసి పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పడిపోవడానికి కారణమవుతున్నాయని వివరించారు. ముందు ముందు ఈ సమస్య మరింత తీవ్రం కావొచ్చని హెచ్చరించారు. ఆహారంతో పాటు జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోకుంటే తప్ప సంతానభాగ్యానికి నోచుకోలేరని ‘హ్యూమన్ రీ ప్రొడక్షన్ సంస్థ’ హెచ్చరించింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News