Wednesday, April 30, 2025

‘స్పిరిట్’ సినిమా ఇంకాస్త లేటు.. ఎందుకంటే..?

- Advertisement -
- Advertisement -

బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ సినిమాతో ఆయన పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయారు. ఆయన సినిమా విడుదలైందంటే చాలా ఆ రోజు ఫ్యాన్స్‌కి పండగే. చివరిగా ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి(పార్ట్-1)’ సినిమాలో కనిపించారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం ప్రభాస్ లైన్‌ఆప్‌లో సలార్ సీక్వెల్, కల్కి సీక్వెల్, ఫౌజీ, రాజాసాబ్, స్పిరిట్ చిత్రాలు ఉన్నాయి.

ఏ సినిమాకు ఆ సినిమా ప్రత్యేకమైంది అయినప్పటికీ.. స్పిరిట్‌పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దాని దర్శకులు సందీప్ రెడ్డి వంగా కాబట్టి. అయితే ఇప్పుడు స్పిరిట్‌ సినిమా సెట్స్‌ మీదకు రావడానికి మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం సందీప్ వంగా.. 65 రోజు వరుస కాల్‌షీట్స్, డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్‌లో నటించాలనే కండీషన్లు పెట్టారట. దీని ప్రభాస్ తొలుత అంగీకరించినప్పటికీ.. ఇప్పుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని టాక్. దీంతో స్పిరిట్ ఇంకొన్ని రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News