Saturday, September 13, 2025

పిజి కోర్సుల్లో స్పోర్ట్స్ కోటా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో ముఖ గుర్తింపు హాజరు (ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్..- ఎఫ్‌ఆర్‌ఎస్) తప్పనిసరి చేయాలని వైస్ ఛాన్స్‌లర్ల సమావేశంలో నిర్ణయించా రు.ఇప్పటికే చాలా వర్సిటీలలో 60శాతానికిపైగా- ఎఫ్‌ఆర్‌ఎస్ హాజ రు విధానం అమలు చేస్తున్నట్లు, త్వరలోనే పూర్తి స్థాయిలో ముఖ గుర్తింపు హాజరు అమలుకు చర్యలు తీసుకుంటామని వైస్ ఛా న్స్‌లర్లు తెలిపారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి అ ధ్యక్షతన శుక్రవారం యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ల సమావేశం జరిగిం ది. ఈ సమావేశంలో యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో ముఖ గుర్తింపు హా జరు అమలు, సిలబస్‌లో మార్పులు, స్పోర్ట్ కో టా తదితర అంశాలను కూలంకుశంగా చర్చించారు.స్కూళ్ల నుంచి యూనివర్సిటీల వరకు రా ష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల బోధనలో నాణ్య తా ప్రమాణాలు పెంచాలని, అందుకు అనుగుణంగా బోధనా సిబ్బందితో పాటు విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్) విధానా న్ని తప్పనిసరి చేయాలని ఇటీవల సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

సిఎం ఆదేశాల అమలుపై విసిల సమావేశంలో చర్చించారు. కొన్ని యూనివర్సిటీలు ఇ ప్పటికే తరగతుల వారీగా విద్యార్థులు, అధ్యాపకుల హాజరును బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నైజేషన్, ఇతర పద్దతుల ద్వారా తీసుకుంటున్న ట్లు ఆయా వర్సిటీ విసిలు వెల్లడించారు. వర్సిటీలలో ముఖ గుర్తింపు హాజరును వేతనాలకు అ నుసంధానం చేసే అంశాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు విధానంలో వర్సిటీలలో సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపా రు. యూనివర్సిటీలలో పూర్తి స్థాయిలో ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు విధానం అమలులోకి వచ్చిన త ర్వాత ఆయా వర్సిటీల అనుబంధ కాలేజీల్లో సైతం ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీ లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి తప్పనిసరిగా 0.5 శాతం స్పో ర్ట్ రిజర్వేషన్ అమలు చేయాలని వైస్ చాన్స్‌లర్ల సమావేశం నిర్ణయం తీసుకున్నారు. క్రీడలను ప్రోత్సహించాలని, విద్యార్థుల్లో దాగివున్న క్రీడా నైపుణ్యాలు వెలికితీయాలని సిఎం రేవంత్‌రెడ్డి పలు సందర్భాలలో చెప్పిన విషయం తెలిసిందే. క్రికెటర్ సిరాజ్, నిక్కత్ జరీనాను ఉదహరిస్తూ విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాల్సిన అవసరాన్ని సిఎం నొక్కి చెప్పారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యలో తప్పనిసరిగా క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈసారి పిజి కోర్సుల్లో స్పోర్ట్ కోటా అమలు చేయాలని విసిల సమావేశంలో నిర్ణయించారు.

విద్యార్థుల్లో ఇంగ్లీష్ నైపుణ్యం పెంపొందించేలా కొత్త సిలబస్
విద్యార్థుల్లో ఇంగ్లీష్ నైపుణ్యం పెంపొందించేలా ఉన్నత విద్యామండలి రూపొందించిన కొత్త సిలబస్‌ను అమలు చేయాలని వైస్ ఛాన్స్‌లర్ల సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుత కాలంలో వి ద్యార్థులు డిగ్రీ పట్టాలు పొందుతున్నా..వారికి ఇంగ్లీష్ ప్రావీణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడంతో అవకాశాలు అందిపుచ్చుకోవడంలో వెనుకబడిపోతున్నారు. ఈ నేపథ్యంలో డిగ్రీ కో ర్సుల్లో ఇంగ్లీష్ సబ్జెక్టులో మార్పులకు ఉన్నత విద్యామండలి శ్రీకారం చుట్టింది. మూస పద్ధతికి స్వస్తి చెప్పి, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సాంకేతికను జోడించి విద్యార్థులు ఇంగ్లీష్‌లో నైపుణ్యం పొందేలా సిలబస్‌లో మార్పులు తీసుకువచ్చారు.

డిగ్రీ ఇంగ్లీష్ సిలబస్‌పై ఉన్నత విద్యామండలి నియమించిన కమిటీ కసరత్తు చేసి నూతన సిలబస్‌ను రూపొందించింది. మా రుతున్న కాలానికి అనుగుణంగా ఇంగ్లీష్ లాం గ్వేజ్‌లో విద్యార్థులు నైపుణ్యాలు పెందే విధంగా డిగ్రీలో సిలబస్‌ను రూపొందించారు. ఆచరణాత్మక విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పు చేర్పులు చేస్తూ ప్రపంచంతో పోటీ పడే లా విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా సిలబస్‌ను రూపొందించారు.
వైస్ ఛాన్స్‌లర్ల సమావేశంలో డిగ్రీ నూతన ఇంగ్లీష్ సిలబస్‌కు సంబంధించిన మెటీరియల్‌ను విసిలకు అందజేశారు. అయితే, ఇప్పటికే తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో కొంత సిలబస్ తగ్గించి అయినా అమలు చేసే అంశంపై చర్చించారు.ఇంగ్లీష్ పాఠాలకు సంబంధించి ఆడి యో పాఠాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో విద్యార్థులు సెలవు రోజుల్లో కూడా నేర్చుకునేలా వారిని ఆడియో పాఠాలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించా రు.విద్యార్థులకు ఆడియో పాఠాలతో పాటు లె ర్నింగ్ మెటీరియల్‌ను పిడిఎఫ్‌లో విద్యార్థులను అందజేయనున్నారు. ఇంగ్లీష్‌తో పాటు ఇతర సబ్జెక్టుల్లో సైతం కొత్త సిలబస్‌ను అమలుపై వైస్ ఛాన్స్‌లర్ల సమావేశంలో చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News