మన తెలంగాణ/ హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా సోమవారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం వల్ల అర్ధాంతరంగా రద్దయ్యింది. భారీ వర్షం హైదరాబాద్ ఇన్నింగ్స్ సాధ్యం కాలేదు. వర్షం వల్ల స్టేడియం చిత్తడిగా మారడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ రద్దు కావడంతో హైదరాబాద్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఆరంభం నుంచే హైదరాబాద్ బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేశారు. ముఖ్యంగా కెప్టెన్ కమిన్స్ అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోయాడు. ఢిల్లీ ఓపెనర్లు కరుణ్ నాయర్ (0), ఫాఫ్ డుప్లెసిస్ (3)లను అతను ఔట్ చేశాడు. అభిషేక్ పొరెల్ (8) కూడా కమిన్స్ వెనక్కి పంపాడు. కెఎల్ రాహుల్ (10), కెప్టెన్ అక్షర్ పటేల్ (6) కూడా విఫలమయ్యారు. దీంతో ఢిల్లీ 29 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ట్రిస్టన్ స్టబ్స్ 41 (నాటౌట్), అశుతోష్ శర్మ (41) జట్టును ఆదుకున్నారు.