Sunday, June 16, 2024

ఢిల్లీ శ్రీరామ్ కాలేజీకి బాంబు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల పోరు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం చెలరేగుతోంది. గురువారం ఇక్కడి లేడీ శ్రీరామ్ కాలేజికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఒక్కరోజు క్రితమే బుధవారం హోం మంత్రిత్వశాఖ కార్యాలయానికి ఇ మొయిల్ ద్వారా బాంబు పేలుతుందనే హెచ్చరిక రావడం కీలక విషయం అయింది. ఇప్పుడు ఇక్కడి ప్రఖ్యాత కాలేజీకి కూడా ఈ బెదిరింపు రావడతో స్థానిక పోలీసు బలగాలు, బాంబు స్కాడ్, బాంబు డిటెక్షన్ టీం హుటాహుటిన కాలేజీకి చేరాయి. అణువణువూ నిశితంగా పరీక్షించాయి. అయితే ఎటువంటి ప్రమాదకర వస్తువు లేదని నిర్థారించుకున్నాయి. కొద్ది వారాలుగా ఢిల్లీలో తరచూ బాంబు బెదిరింపుల లేఖలు, ఫోన్లు వంటివి వస్తున్నాయి.

ఇప్పుడు మధ్యాహ్నం వేళ కాలేజీకి బాంబుబెదిరింపు వచ్చిన విషయాన్ని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులు తెలిపారు. వెంటనే కాలేజీకి రెండు అగ్నిమాపక శకటాలను తరలించినట్లు వివరించారు. స్కూళ్లు, ఆసుపత్రులకు అదేపనిగా బాంబు బెదిరింపులు రావడం పోలీసు యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. ఎప్రిల్ 30వ తేదీన చాచా నెహ్రూ హాస్పిటల్ కూడా ఇటువంటి బాంబు కాల్ ఎదుర్కొంది. ఇక మే 1వ తేదీన ఏకంగా స్థానికంగా ఉండే 150కి పైగా స్కూళ్లకు రష్యాకు చెందిన మొయిలింగ్ సర్వీసెస్ ద్వారా బాంబు బెదిరింపులు వెలువడటం గందరగోళానికి దారితీసింది. తీహార్ జైలుకు కూడా ఇదే విధంగా ఆకతాయిల నుంచి ఫోన్లు వచ్చాయి, ఈ తంతు పట్ల పెద్ద ఎత్తున ఢిల్లీ పోలీసు విభాగం దర్యాప్తు చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News