కొలంబో: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రండో వన్డే మ్యాచ్‌లో శ్రీలంక స్టార్ ఆటగాడు వనిందు హసరంగా (Wanindu Hasaranga) అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓటమిపాలైనప్పటికీ.. బంగ్లాదేశ్‌ను ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో అంతంత మాత్రమ ప్రదర్శన చేశాడు. 13 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో అతను ఓ రేర్ ఫీట్‌ని తన పేరిట లఖించుకున్నాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులతో పాటు.. 100 వికెట్లు తీసిన ఆటగాడిగా హసరంగా (Wanindu Hasaranga) నిలిచాడు. 65 మ్యాచుల్లో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ షాన్ పొలాక్ పేరిట ఉండేది. పొలాక్ 68 వన్డేల్లో ఈ రికార్డు సాధించారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 45.5 ఓవర్లలో 248 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసి శ్రీలంక 48.5 ఓవర్లలో 25 232 పరుగులకు ఆలౌట్ కావడంతో బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1గా సమం చేసింది.