Friday, August 22, 2025

గణాంక దర్శిని పుస్తకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: సామాజిక ఆర్థిక ప్రణాళిక విధాన రూపకల్పనలో గణాంకాలు పాత్ర ముఖ్యమైందని కలెక్టర్ శరత్ అన్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా గణాంక దర్శిని పుస్తకాన్ని కలెక్టర్ శరత్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోజువారి జీవితంలో గణాంకాల వాడకం విధానాలను రూపొందించడంలో గణాంకాలు దోహద పడతాయన్నారు. జిల్లా గణాంక దర్శినిలో జనాభా వాతావరణం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం విద్య రవాణా, నీటి వనరులు, పంటలు కమ్యూనికేషన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ లోకల్‌బాడీ ఇండస్ట్రీస్ సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు వివరంగా ఉంటాయన్నారు. గణాంక దర్శినిలో అన్ని శాఖల జిల్లా గణాంక వివరాలు పొందుపరచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ప్రణాళిక ముఖ్యఅధికారి మనోహర్, తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News