Wednesday, December 4, 2024

అమరుల స్మారకం ముందు తెలంగాణ తల్లి విగ్రహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎం కెసిఆర్ అమరుల స్మారక స్తూపం నిర్మాణం తుది దశ పనులను సోమవారం నాడు పరిశీలించారు. సచివాలయం ముందు ప్రాంతంలో కలియ తిరిగారు. ఈ సందర్భంగా అమరుల స్మారక స్తూ పం ముందున్న విశాలమైన స్థలంలో తెలంగాణ తల్లి విగ్ర హం ఏర్పాటు చేయాలని, విగ్రహానికి రెండు వైపులా అత్యద్భుతమైన ఫౌంటేన్లతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆర్ అం డ్ బి ఇంజినీర్ శశిధర్‌ను సిఎం ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నన్ని రోజులు అమరుల స్మారకం వద్దకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా వుండే విధంగా ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సిఎం సూచించారు.

అక్కడ నుంచి బిఆర్‌కె భవన్ వద్ద నిర్మించిన వంతెనల నిర్మాణాన్ని సిఎం కెసిఆర్ పరిశీలించారు. నూతన సచివాలయ నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసేందుకు ఈ వంతెనలను నిర్మించారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఇప్పటికే పనులన్నీ పూర్తయి చివరిదశ సుందరీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లకు సిఎం పలు సూచనలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News