Saturday, April 20, 2024

ఫలక్‌నుమా బస్‌డిపోలో పురాతనబావి

- Advertisement -
- Advertisement -

పునరుద్ధరణకు సిద్ధమైన హెచ్‌ఎండిఏ, జిహెచ్‌ఎంసి
ఆర్టీసితో ఎంఓయూ సంతకాలు చేసిన హెచ్‌ఎండిఏ అధికారులు

హైదరాబాద్: నగరంలో మరో పురాతన బావి (స్టెప్‌వెల్) పునరుద్ధరణకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) సిద్ధమైంది. దాదాపు 300 సంవత్సరాల క్రితం నాటి ఫలక్‌నూమ బస్‌డిపోలో స్టెప్‌వెల్ ఉన్న అంశం హెచ్‌ఎండిఏ, జిహెచ్‌ఎంసి అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో గత ఏప్రిల్ 03వ తేదీన స్టెప్‌వెల్ పునరుద్ధరణ చర్యల్లో భాగస్వామ్యంగా ఉన్న కల్పనారమేష్‌తో కలిసి హెచ్‌ఎండిఏ, జిహెచ్‌ఎంసి, ఆర్టీసి అధికారులు డిపో లోపల ఉన్న పురాతన బావి (స్టెప్‌వెల్)ను సందర్శించారు.

ఫలక్ నుమా ప్యాలెస్‌కు అతి సమీపంలో ఉన్న ఈ పురాతన భావిని నిజాం తన వ్యక్తిగత ఈత కొలను (స్విమ్మింగ్ పూల్)గా వాడేవారని తెలుస్తోంది. ‘ఫలక్ నుమా బస్‌డిపో స్టెప్‌వెల్’ పునరుద్ధరణ కోసం శనివారం ఆర్టీసి, హెచ్‌ఎండిఏ, జిహెచ్‌ఎంసి, సాహి ఎన్జీఓ సంస్థ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. ఈకార్యక్రమంలో హెచ్‌ఎండిఏ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సిఐఓ) షేక్ మీరా, జిహెచ్‌ఎంసి చార్మినార్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్, సొసైటీ ఫర్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండివోర్ జాయింట్ సెక్రెటరీ కల్పన రమేష్, ఆర్టీసి డిప్యూటీ ఆర్‌ఎం వినయ్ భాను, ఫలక్ నూమా డిపో మేనేజర్ జాకీర్ హుస్సేన్, హెచ్‌ఎండిఏ డీఏఓలు ఎం.బద్రీనాథ్, అరుణ్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News