Sunday, April 28, 2024

పట్టపగలే భారీ చోరీ

- Advertisement -
- Advertisement -

ఘట్‌కేసర్: పట్టపగలు ఘట్‌కేసర్ పట్టణంలోని ద్వారకా నగర్‌లోని ఓ ఇంటి తాళం పగులగొట్టి దుండగలు భారీ చోరీ కి పాల్పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి ద్వారకా నగర్ కాలనీలో నివాసం ఉంటున్న తాల్క రాములు కుటుంబ సభ్యులతో కలసి గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చికి వెళ్ళగా ఇదే అదునుగా భావించిన దుండగలు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న 9.5 లక్షల నగదు, 20 తులాల బంగారం అభరణాలు దోచుకెళ్ళినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు.

చర్చి నుండి ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంటి తాళాలు పగులగోట్టి ఉండడంతో, పోలీసులకు సమాచారం అందించనట్లు కుటుంబ సభ్యు లు వాపోయారు. ఇళ్ళు అమ్మగా 10లక్షల రూపాయలు వస్తే అందులో 50 వేలు ఖర్చు చేసుకోవడం జరిగిందని, మిగిలిన 9.5లక్షల రూపాయలు కవర్‌లో కట్టి బీరువాలో పెట్టామని కుటుం సభ్యులు తెలిపారు. సాయంత్రం ఏసిపి నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో దోపిడి జరిగిన తీరును పరిశీలించి సంబందిత ఆధారాలు సేకరిస్తున్నామని అన్నారు. ఈ మేరకు రాములు కుమారుడు తాల్క రంజిత్ కుమార్ పిర్యాదుతో కేసు నామోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
చోరీ ఘటనతో ఉలిక్కిపడ్డ ప్రజలు
పట్ట పగలు ఘట్‌కేసర్ పట్టణం ద్వారకా నగర్ కాలనీలో గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చికి వెళ్ళిన రాములు ఇంటి తాళం పగులగొట్టి దుండగలు భారీ చోరికి పాల్పడడం పోలీసులకు సవాలుగా నిలిచింది. భారీ చోరి అంటు సోషల్ మీడియాలో వార్త దహనంలా వ్యాపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉల్కిపాటుకు గురైనారు. ఇది తెలిసిన వారి పనే నా లేకా ఎవరైన రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడ్డార అనే అనుమానాలు వ్యక్తమైతున్నాయి. ఎక్కడికక్కడా సిసి కెమరాలు ఏర్పాటుతో, భద్రత పెరగడంతో కొంత కాలంగా ఇలాంటి దొంగతనాలు చాలా అరుదుగా చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సందర్భంలో శుక్రవారం పెద్ద మొత్తంలో చోరీ జరగడంతో ప్రజలు ఒక్కసారి ఉలిక్కిపాటుకు గురైనట్లు తెలిసింది. ఏది ఏమైనప్పటికి పోలీసుల వైఫల్యామా లేదా ఇది తెలిసిన వారి పనేనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News