Friday, April 19, 2024

ట్రంప్ మెడకు రాసలీలల ఉచ్చు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : అమెరికాలో నగ్నతార స్టోర్మీ డేనియల్స్ వ్యవహారం ఇప్పుడు మాజీ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ భవితకు ఉచ్చుగా బిగుసుకుంది. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార దశలో ఆమెకు ట్రంప్ గోప్యంగా అందించిన డబ్బు సంబంధిత కేసులో అమెరికాలోని మాన్‌హట్టన్ న్యాయస్థానం శుక్రవారం ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదు చేసినట్లు నిర్థారించింది. దీనితో అమెరికాలో ఈ విధంగా నేరపూరిత అభియోగాలు ఎదుర్కొనే తొలి మాజీ అధ్యక్షులు గా ట్రంప్ నిలిచారు. ఈ పరిణామానికి చాలా కాలంగా తాను సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ చాలాకాలంగా చెపుతూ వస్తున్నప్పటికీ, అరెస్టు అవుతానని ప్రకటించినప్పటికీ ఈ పరిణామంతో ఆయన వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల ఆలోచనపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ఆయన ఎన్నికల రంగంలోకి దిగడానికి వీలుంటుందా? అనే న్యాయపరమైన ప్రశ్న కూడా వెలువడింది.

తనకు ట్రంప్‌తో రహస్య సంబంధాలు ఉన్నాయని, ఈ విషయాన్ని తాను ఎన్నికల ప్రచార దశలో ప్రజల ముందుకు వెళ్లి ప్రకటిస్తానని చెప్పడంతో తన నోరుమూయించేందుకు ట్రంప్ తనకు భారీగా సొమ్ము అందించాడని ఈ పోర్న్‌స్టార్ పేర్కొంది. సంబంధిత అభియోగంపై మాన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ అల్విన్ బ్రాగ్ దర్యాప్తు జరిపారు. తరువాత ట్రంప్‌పై అభియోగాలు దాఖలు అయ్యాయి. ఇక ఆయన క్రిమినల్ కేసు విచారణను ఎదుర్కొనేందుకు సంబంధిత చట్టం ప్రకారం ముందుగా అరెస్టు కావల్సి ఉంటుంది. అనిర్థిష్ట అభియోగాలకు సంబంధించి ట్రంప్ సరెండర్ కావల్సి ఉందని, ఇందుకు సహకరించాలని ఆయన తరఫు లాయర్లను కోరినట్లు జిల్లా న్యాయస్థానం తెలిపింది. ఈ తీర్పుపై ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వీలుందా? లేదా అనేది పూర్తి స్థాయిలో నిర్థారణ కాలేదు. కాగా ఇప్పటి పరిణామాల నేపథ్యంలో స్వస్థలం ఫ్లోరిడాలో ఉన్న ట్రంప్ న్యూయార్క్‌కు సోమవారం చేరుకుంటారు. మంగళవారం కోర్టుకు హాజరవుతారు, అప్పుడు ఆయనపై అభియోగాలను లాంఛనంగా చదివి విన్పిస్తారు. తాను ఎటువంటి తప్పిదం చేయలేదని ట్రంప్ ఇప్పుడు తెలిపారు.

కేవలం తనపై రాజకీయ కక్ష సాధింపు, ఎన్నికలలో పోటీకి దిగకుండా ఉండేందుకే ఉన్నత స్థాయి ప్రమేయంతోనే ఈ విధంగా జరిగిందని స్పందించారు. అమెరికా చరిత్రలో ఇంతకు ముందెప్పుడూ ఈ విధంగా జరగలేదని , అధికారంలో ఉన్న డెమోక్రాట్లు చివరికి దేశంలోని న్యాయ వ్యవస్థను కూడా లోబర్చుకుని ప్రత్యర్థులపై ఆయుధంగా వాడుకుంటున్నారని విమర్శించారు. మాన్‌హట్టన్ జిల్లా జడ్జిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యక్తి ఆ స్థానంలో కూర్చుని ఈ విధంగా జోబైడెన్ డర్టీగేమ్‌ను సాగించే బాధ్యతలు తీసుకున్నట్లుగా ఉందన్నారు. డెమోక్రాట్లు అబద్థాలకోర్లు, మోసగాళ్లు, ఏదో విధంగా ట్రంప్‌ను దెబ్బతీయాలనేదే వారి ఆలోచన అని విమర్శించారు . ఇప్పుడు ట్రంప్‌పైవ విచారణ జరిగి అభియోగాలు రుజువు అయితే ఆయనకు నాలుగేళ్ల జైలు పడే వీలుంటుంది. లేకపోతే కేవలం జరిమానాతో సరిపెడుతారు.
2006లో లేక్‌తహోయి హోటల్‌లో రాసలీల?
తనకు ట్రంప్‌తో రహస్య సంబంధం ఉందని పోర్న్‌స్టార్ స్టోర్మీ పేర్కొంది. తాము 2006లో లేక్ తహోయి హోటల్‌లో గడిపినట్లు తెలిపింది. మెలానియాను టపెళ్లిచేసుకున్న ఏడాది తరువాత ట్రంప్ తనతో గడిపినట్లు వెల్లడించింది. తరువాత చాలా కాలం ఈ వ్యవహారం సాగింది. 2016లో దేశాధ్యక్షులుగా ఎన్నిక కావడానికి ముందు ట్రంప్ ఆమె తనతో నెరిపిన సంబంధాన్ని బహిర్గతం చేయకుండా ఉండేందుకు ఆమెకు 1,30,000 డాలర్లు చెల్లించినట్లు వెల్లడైంది. ఎన్నికల ప్రచారంపై ఈ లోగుట్టు సొమ్ము వ్యవహారం ఆమెతో అక్రమ సంబంధం బయటపడకుండా ఉండేందుకు ట్రంప్ తనతో బేరం కుదుర్చుకున్నాడని ఈ మహిళ చెప్పడం ఇప్పుడు ట్రంప్‌పై విచారణకు దారితీసింది. కాగా ట్రంప్ అరెస్టు కానున్నారని, త్వరలోనే దోషి అవుతారని వార్తలు వెలువడటంతో ఆమెఇటీవల హర్షం వ్యక్తం చేశారు. ఇదే జరిగితే తాను నడివీధుల్లో ఏ విధంగా అయినా డాన్స్ చేస్తానని, ఆయన అరెస్టు రోజుకోసం చూస్తున్నానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News