Thursday, April 25, 2024

వర్శిటీల్లో మో’ఢీ’.. షో

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : స్థానిక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు)లో మంగళవారం తీవ్ర కలకలం చెలరేగిం ది. వర్శిటీ అధికారులు ఉన్నట్లుండి వర్శిటీ పరిధిలో కరెంట్, ఇంటర్నెట్ సరఫరాను నిలిపివేశారు. ప్రధాని మోడీపై తీసిన బిబిసి వివాదాస్పద డాక్యుమెంటరీని కొం దరు విద్యార్థులు క్యాంపస్‌లో ఓ రహస్యస్థలంలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.ఈ సమాచారం తెలిసిన విద్యాలయ అధికారులు వెంటనే ఇంటర్నెట్ దీని కి ముందు విద్యుత్ సరఫరాలను నిలిపివేశారు. దీనితో విద్యార్థుల ల్యాప్‌ట్యాప్‌లు, కంప్యూటర్లు పనిచేయలేదు. దీనితో గందరగోళం ఏర్పడింది. విద్యార్థి సంఘం కార్యాలయం చీకట్లో ఉండాల్సి వచ్చింది. బిబిసి డాక్యుమెంటరీని చూడకూడదని అధికారులు ముందుగానే సర్కులర్ పంపించారు. అయినప్పటికీ భావ స్వేచ్ఛ నినాదంతో వి ద్యార్థులు కొందరు రాత్రి 9 గంటలకు ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనకు తగు ఏర్పాట్లు చేసుకున్నారు. పలువురు వి ద్యార్థులు దీనిని చూసేందుకు సిద్ధం అయ్యారు.

ఓ వైపు ఈ చిత్ర ప్రదర్శనకు దిగితే క్రమశిక్షణాచర్యలు తప్పవని, వీక్షకులపై కూడా చర్యలు ఉంటాయని వెలువడ్డ హెచ్చరికలను విద్యార్థులు బేఖాతరు చేశారు. దీనితో కొద్ది సేపు క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఉన్నతాధికారులతో సం ప్రదించిన వర్శిటీ అధికారులు కరెంటు, ఇంటర్నెట్ తీసివేసి, బిబిసి డాక్యుమెంటరీ ప్రదర్శనకు బ్రేక్‌లు వేశారు. అధికారుల చర్య పట్ల సిపిఎం అనుబంధమైన వామపక్ష విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షులు అయేషి ఘోష్ నిరసన వ్యక్తం చేశారు.ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన నిబంధనలకు వ్యతిరేకం కాదని, సామరస్య విచ్ఛిత్తికి దారితీయబోదని తెలిపారు. తాము తప్పనిసరిగా దీనిని చూస్తామని , అవసరం అయితే క్యూఆర్ కోడ్ ఇతరత్రా హైటెక్ టెక్నిక్‌లతో దీనిని చూసే తీరుతామని ప్రకటించారు.

సెల్‌ఫోన్లలో డాక్యుమెంటరీ వీక్షణం

డాక్యుమెంటరీ చూసి తీరాలనే తపనతో ఉన్న విద్యార్థుల గుంపు క్యాంపస్‌లోని కేఫ్‌లోకి వెళ్లి, డాక్యుమెంటరీని తమ సెల్‌ఫోన్లలోకి డౌన్‌లోడ్ చేసుకుని, అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ఈ వీడియో తిలకించారు. మోడీని కించపరుస్తూ ఈ డాక్యుమెంటరీ ఉందని పేర్కొం టూ కేంద్ర ప్రభుత్వం గత వారం యూట్యూబ్, ట్విట్టర్‌లు దీనిని డీలింక్ చేయాలని ఆదేశించింది. 2002 గుజరాత్ ఘర్షణలలో అప్పటి సిఎం ఇప్పటి ప్రధాని మోడీ పాత్ర ఉందనే అంశాలను ఈ డాక్యుమెంటరీలో ప్రస్తావించారని కేంద్రం బ్రిటన్‌కు నిరసన తెలిపింది. తమకు దీనితో సంబంధం లేదని బ్రిటన్ తిరుగు సమాధానం ఇచ్చింది. డాక్యుమెంటరీ చూడకుండా చేయాలనే కేంద్రం ఆదేశాలను విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. బిబిసి చిత్రం తప్పుడు కట్టుకథల కల్పితం అని కేంద్రం తిప్పికొట్టింది.

హైదరాబాద్ వర్శిటీలో సౌభ్రాతృత్వ ఉద్యమం

హైదరాబాద్ : ప్రధాని మోడీపై వచ్చిన వివాదాస్పద బిబిసి డాక్యుమెంటరీని మంగళవారం హైదరాబాద్ యూనివర్శిటీ (హెచ్‌సియూ) విద్యార్థులు కొందరు ఆరుబయటే కూర్చుని తిలకించారు . ఈ ఘటనపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించి, క్యాంపస్ అధికారుల నుంచి నివేదిక కోరారు. క్యాంపస్‌లో కొందరు విద్యార్థుల బృందం ‘ఫ్రెటర్నిటీ మూవ్‌మెంట్’గా (సౌభ్రాతృత్వ ఉద్యమం) పేరిట తమను తాము పేర్కొంటూ ఈ డాక్యుమెంటరీని చూసిందని వర్శిటీ రిజిస్ట్రార్ దేవేష్ నిగమ్ ఓ ప్రకటన వెలువరించారు. బిబిసి ఫిల్మ్ ‘ఇండియా ః ది మోడీ క్వశ్చెన్’ పేరిట ఈ చిత్రంలో మోడీ హయాంలోనే గుజరాత్‌లో ఘర్షణలు జరిగాయనే ఆధారాల భరిత చిత్రీకరణ జరిగింది. ఇది వివాదాస్పదం అయింది. ఇండియాలో ప్రదర్శనకు అడ్డుకట్ట పడింది. దీనిని ఎటువంటి అనుమతి లేకుండా విద్యార్థులు నార్త్ క్యాంపస్‌లో ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో కూర్చుని చూశారని రిజిస్ట్రార్ తెలిపారు.

విద్యార్థులు బయట కూర్చుని మాల్ బయట ఏర్పాటు చేసుకున్న స్క్రీన్‌పై దీనిని చూసినట్లు వెల్లడించారు. సమాచారం తెలియగానే భద్రతా సిబ్బంది, డీన్, స్టూడెంట్స్ వెల్‌ఫేర్ వారు అక్కడికి చేరారు. ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు. అయితే దీనికి నిర్వాహకులు అంగీకరించలేదు. కొద్ది మంది ఎదుట ఈ ఫిల్మ్ ప్రదర్శన పూర్తిగా జరిగిందని రిజిస్ట్రార్ తెలిపారు. అనుమతి లేకుండా విద్యార్థులు ఈ విధంగా చేయడం ద్వారా క్యాంపస్ నిబంధనలను ఉల్లంఘిచారని అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు క్యాంపస్‌లో జరగలేదని, అంతా ప్రశాంతంగా సజావుగా ఉందని అధికారి తెలిపారు. అయితే తమకు సంబంధిత అంశంపై వెంటనే నివేదిక కావాలని తమకు ఆదేశాలు అందాయని చెప్పారు.మరో వైపు ఢిల్లీలోని జెఎన్‌యూలో బిబిసి డాక్యుమెంటరీని తిలకించిన విద్యార్థులపై కొందరు రాళ్లు రువ్విన ఘటనలు జరిగినట్లు, ఆ తరువాత ఉద్రిక్తత చెలరేగిందని మంగళవారం రాత్రి సమాచారం వెలువడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News