Monday, April 29, 2024

కేర్ ఆసుపత్రిలో విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స

- Advertisement -
- Advertisement -

అనంతపురంకు చెందిన సాప్ట్‌వేర్ దినేశ్ ప్రాణాలు కాపాడిన వైద్య బృందం
అవయవ మార్పిడితో పునర్జీవం పొందవచ్చు

జీవన్‌దాన్ ఇంఛార్జి స్వర్ణలత

మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రి వైద్యులు మరో గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అనంతపూర్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మిస్టర్ దినేశ్ కు  కేర్ ఆసుపత్రి వైద్యులు నిర్విరామంగా శ్రమించి గుండె మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశారు. కొంత కాలంగా దినేశ్ గుండె డైలేటెడ్ కార్డియోమయోపతితో బాధపడుతున్నట్లు నిర్ధారణ కాగానే దినేశ్ ప్రయాణం ఊహించని మలుపు తిరిగింది. శ్వాస తీసుకోవడంలో అతని దైనందిన జీవితానికి అంతరాయం ఏర్పడింది. ఆటోమేటిక్ ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డీఫిబ్రిలేటర్ ఇంప్లాంటేషన్ చేయించుకున్నప్పటికీ, అతని పరిస్థితి మెరుగుపడలేదు.

నిపుణుల మార్గదర్శకత్వం కోరుతూ కేర్ ఆసుపత్రిలో ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్, గుండె మార్పిడి సర్జన్ అయిన డాక్టర్ నగేశ్ ను సంప్రదించారు. దీనితో డాక్టర్ నగేశ్ వైద్య బృందం సమగ్ర మూల్యాంకనం తర్వాత, గుండె మార్పిడి సరైన చర్య అని నిర్ధారించబడింది. దీనితో మిస్టర్ దినేశ్ జీవన్‌దాన్‌లో నమోదు చేయబడ్డారు. రెండు నెలలకు పైగా వేచి ఉన్న తరువాత సరైన గుండె దాతను గుర్తించారు. డాక్టర్ నగేశ్ నాయకత్వంలో, మరోక ఆసుపత్రిలో రోడ్డు ట్రాఫిక్ ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన రోగి నుండి గుండెను సేకరించి గుండె మార్పిడి శస్త్ర చిక్సితను కేర్ ఆసుపత్రిలోని చీఫ్ కార్డియాక్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ నగేశ్ వైద్య బృందం విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించారు.

అవయవ మార్పిడి శస్త్రచికిత్సతో ఎంతోమంది నిరుపేదలు పునర్జీవం పొందుతున్నారని రాష్ట్ర జీవన్ దాన్ ఇంచార్జి డాక్టర్ స్వర్ణలత చెప్పారు. అవయవదానంపై అవగాహన పెరిగితే చాలామందికి మేలు జరుగుతుందని, ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియాది కీలక పాత్ర అన్నారు. అవయవదానంపై అవగాహన పొందడానికి అవయవదానంలోను, అవ యవమార్పిడి శస్త్రచికిత్సల్లోనూ దేశంలోనే రాష్ట్రం తొలిస్థానంలో ఉన్నదని తెలిపారు. అవయవమార్పిడి శస్త్రచికిత్సను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేయిస్తున్నదన్నారు. అవయవ దానం కోసం ముందుకొచ్చేవారి సమాచారాన్ని జీవన్‌దాన్ వెబ్‌సైట్‌లో ఉంచుతామని, ఎవరైనా బ్రెయిన్ డెడ్‌కు గురైతే బంధువులకు కౌన్సెలింగ్ ఇచ్చి అవయవాలు సేకరిస్తామని చెప్పారు. అతని అవయవాలు సరిపోయే రోగికి అమర్చుతామని వివరించారు. అవయవదానంతో మరణించి కూడా జీవించవచ్చని, ఇది ఎంతో మందికి పునర్జన్మను ప్రసాదిస్తుందని కేర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సయ్యద్ కమ్రాన్ హుస్సేన్ తెలిపారు.అనంతరం డాక్టర్ అజిత్ సింగ్ మాట్లాడుతూ అవయవ దానం చేసే దాతలు దైవంతో సమానమని అవయవాలను దానం చేసిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అవయవ దానం చేయడం దేవుడు ఇచ్చిన వరమని, దీంతో మనిషి మరణించి కూడా ఇతరుల శరీరాల ద్వారా జీవించవచ్చన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News