Tuesday, April 30, 2024

అయోధ్యలో అద్భుత దృశ్యం… బాలరాముడికి సూర్య తిలకం

- Advertisement -
- Advertisement -

లక్నో: అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అయోధ్య బాలరాముడి నుదుటన సూర్యకిరణాలు ప్రసరించాయి. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున రాముడి నుదుటన కిరణాలతో సూర్యతిలకం దిద్దారు. రాముడి నుదుటన మూడున్నర నిమిషాలపాటు సూర్యతిలకం దిద్దారు. దాదాపు రెండు నిమిషాల పాటు పూర్తిస్థాయి తిలకంగా రాముడు దర్శనమిచ్చారు. రాముడి నుదుటన 58 మిల్లిమీటర్ల పరిమాణంలో సూర్య కిరణాలు ప్రసరించాయి. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు సూర్యతిలకం వీక్షించేందుకు అలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

Sun rays on Bala ramudu

 

సూర్య కిరణాలు రాముడి నుదిటిపై ప్రసరించేందుకు కటకాలు, అద్దాలు, గేర్‌బాక్సులను ఉపయోగించామని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. సూర్య చంద్రరాశుల తిథులు 19 ఏళ్లకు ఒకసారి కలుస్తాయి కావునా 19 గేర్ బాక్స్‌లను ఉపయోగించినట్టు సమాచారం. చాంద్రమాన తిథికి అనుకూలంగా సూర్య కిరణాలు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున రాముడి నుదుటిపై ఒకే స్థానంలో ప్రసరించేలా చేస్తారు. సూర్య కిరణాల ప్రసారం కోసం ఉక్కు, ఇనుము, బ్యాటరీలు, విద్యుత్ వాడలేదని సిబిఆర్‌ఐ పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News