మేషం: మేష రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలపరంగా మంచి పేరు సంపాదిస్తారు. భవిష్యత్తు కార్యక్రమాల కోసం ముందుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నలుగురితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. మీ స్వయంకృషితో పైకి రావడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు మంచి లాభాలను తెచ్చి పెడతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయించండి.
సంతానం విషయంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. సినీ పరిశ్రమలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రతి విషయంలో కూడా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన విషయాలలో ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. విదేశాలలో ఉండి ఉద్యోగ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ వారం ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిష్టాత్మకమైన కాలేజీలో సీటు లభిస్తుంది. భూమి కానీ గృహం కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ప్రథమార్ధం కంటే ద్వితీయార్థం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు.ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ప్రతిరోజు శివనామ స్తోత్రాన్ని కానీ శని గ్రహ స్తోత్రాన్ని గాని చదవడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.
వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఏ పని మొదలుపెట్టిన ముందుకు సాగుతుంది. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి వాతావరణం ఉంటుంది. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు కలిసి వస్తాయి. గురువు అనుకూలంగా ఉన్న కారణం చేత మీరు ఏ పని తలపెట్టిన నిర్విఘ్నంగా సాగుతుంది. మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి కలిసి వస్తుంది. నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తారు.
భాగస్వామ్య వ్యాపారాల కంటే మీరు సొంతంగా చేసుకున్న వ్యాపారాలే మీకు కలిసి వస్తాయి. దైవానుగ్రహం వల్ల కొన్ని ప్రయత్నాలు మీ ప్రమేయం లేకుండానే కలిసి వస్తాయి. ఇకనుంచి అయినా సరే కొంత సుఖం అనేది ఏర్పడుతుంది. నూతన గృహం కొనుగోలు చేస్తారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి వారం సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు తెలుపు. ప్రతిరోజు నుదుటన నాగ సింధూరం ధరించండి. ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి.
మిథునం: మిధున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జన్మరాశిలో గురువు ప్రవేశిస్తున్నాడు కాబట్టి కొన్ని శుభఫలితాలు ఉంటాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార విస్తరణ చేస్తారు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్యా అవకాశాలు కలిసి వస్తాయి.
ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. గ్యాస్ట్రిక్ అసిడిటీ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పెద్దలపట్ల గౌరవం కలిగి ఉంటారు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది అయినప్పటికీ చెల్లించవలసిన చెల్లింపులు సమయానికి చేయగలుగుతారు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. చిరు వ్యాపారస్తులకు రియల్ ఎస్టే రంగంలో ఉన్నవారికి ఈ వారం చాలా బాగుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసే వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కర్కాటకం : కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయరంగంలో ఉన్నవారికి మంచి పదవి లభిస్తుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులైన విద్యావంతులకు మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో రాణించగలుగుతారు. ప్రభుత్వపరంగా రావలసిన స్కీములు లైసెన్సులు రెన్యువల్సు లాబిస్తాయి. కళా సాంస్కృతిక రంగంలో ఉన్నవారికి అవార్డులు లభిస్తాయి. నిత్యవసర సరుకులు అమ్మేవారికి లాభాలు బాగుంటాయి.
ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ద్వితీయ వివాహప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు తెలుపు. సిద్ధ గంధంతో స్వామివారి కానీ అమ్మవారి కానీ అభిషేకం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం బాగుంది. ప్రభుత్వ పరంగా రావలసిన బెనిఫిట్స్ ఈ వారం అందుతాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ వారం కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు మొదలు పెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. వాహనయోగం ఉంది. అమ్మకాలు కొనుగోలులో లాభాలు పొందుతారు. గృహ నిర్మాణ పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా హనుమాన్ వవత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు తెలుపు.
కన్య: కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. చెప్పుడు మాటలు వినకుండా ప్రతి విషయంలో మీరు కలగజేసుకొని సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విదేశాలలో ఉండే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు పనిచేయద్దు. ఇంట బయట చికాకులు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి.
దైవ దర్శనాలు చేసుకుంటారు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కళా రంగంలో ఉన్నవారు చక్కగా రాణిస్తారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. అలాగే సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
తుల: తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలపరంగా బాగుంటుంది. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు ఈ వారం పూర్తవుతాయి. మీకున్న తెలివితేటలతో నలుగురిని మెప్పించగలుగుతారు. మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఎక్కువగా శ్రమిస్తారు. మీరు చేపట్టిన పనులలో ఆశించిన పురోగతి కలుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తిని ఇస్తాయి.
ఉద్యోగ పరంగా వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన విషయాలలో ఆటంకాలు కలుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. శుభకార్యాల విషయాలలో మీదే పై చేయి ఉంటుంది. పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గురు గ్రహ అనుకూలత వల్ల మేలు జరుగుతుంది. ప్రథమార్ధం కంటే ద్వితీయార్థంలో చాలా బాగుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు చూస్తున్న వారు ఈ వారం లాభాలను అందుకోగలుగుతారు. మీపై వచ్చిన విమర్శలను లెక్కచేయరు. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రే. మేధో దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి. రుద్ర పాశుపత హోమం చేయించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సంతాన మంచి అభివృద్ధిలోకి వస్తారు. వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. సంతానం పట్ల ఎక్కువ మక్కువ చూపుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. బంధు వర్గంతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. వ్యాపార పరంగా చాలా బాగుంటుంది.
వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో రొటేషన్ కూడా బాగుంటుంది. స్నేహితులలో ఈర్ష్యా ద్వేషాలు పెరుగుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. స్థిరాస్తులను పెంచుకోగలుగుతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ వాక్చాతుర్యంతో అందరిని మెప్పించగలరు. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు ఎల్లో.
ధనస్సు: ధనస్సు రాశి వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆగిపోయిన పనులు తిరిగి పునర్ ప్రారంభం అవుతాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. నూతన బ్రాంచీలను నెలకొల్ప గలుగుతారు. నూతన పెట్టుబడును కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు బాగుంటాయి. నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. రావలసిన ధనం చేతికి అందుతుంది. కాంట్రాక్టులు లీజులు లాబిస్తాయి. శుభకార్యాలు చేస్తారు బరువు బాధ్యతలు దించుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. విదేశాలు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు చేసే పనిలో ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటారు. భూ సంబంధిత విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి.
రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ వారం లాభాలు బాగుంటాయి. గృహ నిర్మాణ పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. స్టాక్ మార్కెట్ కి దూరంగా ఉండండి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. ధనం పొదుపు చేస్తారు. విహారయాత్రలు చేస్తారు. రైతులకు అకాల వర్షాల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4 కలిసివచ్చే రంగు తెలుపు. అమ్మవారికి ఆరావళి కుంకుమతో పూజ చేయండి. నాగ సింధూరాన్ని ప్రతిరోజు నుదుటన ధరించండి.
మకరం: మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థికపరంగా మీరు ఆశించిన పురోగతి కలుగుతుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. అవసరానికి ధన సహాయం అందుతుంది. దీర్ఘకాలిక ఋణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారంలో లాభాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి చిరు వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. చేతి వరకు వచ్చిన సంబంధం చేజారిపోతుంది.
అది మీ మనోవేదనకు కారణం అవుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. కొంతమంది ఋణాలు మొత్తం తీర్చి వేయగలుగుతారు. రాజకీయరంగంలో ఉన్నవారికి ఉన్నత పదవి లభిస్తుంది. మీరు ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలుపెడితే అందులో విజయం సాధించేవరకు కష్టపడతారు. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. శుక్రవారం రోజున ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే రంగు తెలుపు.
కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది ఇది అందరికీ కాదు కొద్దిమంది విషయంలో మాత్రమే. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువులు మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో వచ్చిన లాభాల కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి. సంతాన విషయంలో క్రమశిక్షణ లోపించే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.
మీనం: మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా పురోగతి కలిగి అవసరానికి ధనసహాయం అందుతుంది. రావలసిన మొండి బాకీలు ఈ వారం వసూలు అవుతాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. మీపై దుష్ప్రచారం చేసేవారు అధికంగా ఉంటారు.
విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రతి విషయంలో కూడా గోప్యత అవసరం. ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సంతాన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. రాజకీయరంగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపంలో భద్రపరచుకోవడం మంచిది. ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాలను చదవడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది, కలిసి వచ్చే రంగు తెలుపు.చ్చే రంగు ఎల్లో.