Saturday, May 24, 2025

చెలరేగిన ఇషాన్ కిషన్..రాయల్‌ ఛాలెంజర్స్ టార్గెట్ ఎంతంటే..?

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 18వ సీజన్‌లో భాగంగా ఎకానా స్టేడియం వేదికగా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో(SRH) జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. హైదరబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వేగంగా పరుగులు రాబట్టారు.వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లుంగి ఎంగిడి బౌలింగ్ లో (3.6) ఫిల్ స్టాల్ కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ(36) వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ (94;48 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్ లు) నాటౌట్ గా నిలిచాడు. రాయల్‌ ఛాలెంజర్స్ బౌలర్లలో షెఫర్డ్ 2, కృనాల్ పాండ్య, సుయాశ్ శర్మ, లుంగి ఎంగిడి, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News