Saturday, June 3, 2023

టాచ్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ డ‌బుల్ హెడ‌ర్‌లో ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్ హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరుగ‌ుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జ‌ట్టు ఈ మ్యాచ్‌లో మొద‌ట‌ టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకుని, రాజస్థాన్‌ రాయల్స్‌కు బ్యాటింగ్ అప్ప‌గించింది. ఇక ఎస్‌ఆర్‌హెచ్ కొత్త కెప్టెన్ మార్‌క్రమ్‌ తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేక‌పోవ‌డంతో ఈ మ్యాచ్‌కు భువనేశ్వర్‌ కుమార్ క్యెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు.

ఇప్పటికే ఉప్పల్ స్టేడియం వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు. మూడేళ్ల తర్వాత హైదరాబాద్ లో ఐపిఎల్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ కోసం 1500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్నాటు చేశారు. స్డేడియం చుట్టూ అదనంగా సిసి కెమారాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. స్డేడియం వద్ద సిపి డిఎస్ చౌహాన్ భద్రతను పర్వవేక్షిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News