Saturday, October 12, 2024

కేజ్రీవాల్‌కు బెయిల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ నేత, సిఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. దేశవ్యాప్త సంచలనానికి దారితీసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అక్రమాలు పలువురు నేతలపై కేసులకు దారితీశాయి. సిబిఐ దాఖలు చేసిన కేసుకు సంబంధించి దీర్ఘకాలిక నిర్బంధం వ్యక్తుల స్వేచ్ఛను అన్యాయంగా హరించడమే అవుతుందని ధర్మాసనం ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సిబిఐ ధోరణిని తూర్పార పట్టింది. ఈ స్కామ్‌కు సంబంధించి కేజ్రీవాల్‌ను ఇడి మార్చి 21వ తేదీన అరెస్టు చేసింది. మే 10 వ తేదీన లోక్‌సభ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో తాత్కాలిక బెయిల్ దక్కింది. తరువాత జూన్ 2 నుంచి ఆయన జైలుకు పంపించారు. న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం కేజ్రీవాల్‌కు రూ 10 లక్షలతో బెయిల్ బాండ్ , ఇద్దరు ష్యూరిటీల షరతులతో మంజూరు చేసింది.

ఈ బెయిల్ దశలో కేజ్రీవాల్ బహిరంగంగా కేసు గురించి ఎటువంటి వ్యాఖ్యలకు దిగరాదని , ఇప్పుడు సిబిఐ కేసుకు సంబంధించి దీనిని మంజూరు చేస్తున్నామని ఇడి కేసులో వర్తించే నిబంధనలు ఇప్పుడు కూడా కేజ్రీవాల్‌కు వర్తిస్తాయని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుత షరతుల నేపథ్యంలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఎటువంటి అధికారిక కార్యకలాపాలు నిర్వహించరాదు. సచివాలయానికి వెళ్లరాదు. అధికారిక కార్యాలయానికి కూడా హాజరుకారాదు. అత్యవసరం అయ్యి వెళ్లాలనుకుంటే తప్పనిసరిగా ఢిల్లీ లెఫ్టినెంట్ అనుమతి తీసుకోవల్సిందే. ఇక విచారణ ఇప్పటికిప్పుడు పూర్తి చేయడం కుదరదని పేర్కొన్నారు. ఇదే సమయంలో కేజ్రీవాల్ ద్వారా సాక్షాధారాల తారుమారు అవకాశం ఉందనే వాదనను కూడా బెంచ్ తోసిపుచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News