Monday, November 4, 2024

ఢిల్లీలో కాలుష్యం..కేంద్రానికి సుప్రీం హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దగ్ధం వల్ల ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోందని సుప్రీం కోర్టు బుధవారం పేర్కొంటూ, సవరణలతో పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ‘నిర్వీర్యం’ చేసినందుకు కేంద్రాన్ని తీవ్రంగా మందలించింది. పది రోజుల్లోగా నిబంధనలను ఖరారు చేసి, చట్టాన్ని ‘పూర్తి ఆచరణయోగ్యం’గా చేస్తామని కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ (ఎఎస్‌జి) ఐశ్వర్య భాటి కోర్టుకు తెలిపారు. ‘మేము కేంద్రం భరతం పడతాం& అది ఏ యంత్రాంగాన్నీ సృష్టించలేదు. పర్యావరణ పరిరక్షణ చట్టం నిర్వీర్యమైంది. మీరు శిక్షను వదిలివేసి, సెక్షన్ 15ను సవరించడం ద్వారా ఒక పెనాల్టీని దాని స్థానంలో చేర్చారు. పెనాల్టీ విధించేందుకు అనుసరించవలసిన ప్రక్రియను పాటించజాలరు’ అని సుప్రీం కోర్టు పేర్కొన్నది. నిబంధనల ఉల్లంఘనకు విధించవలసిన పెనాల్టీను చట్టంలోని సెక్షన్ 15 వివరిస్తున్నది.

‘పంజాబ్, హర్యానా కార్యదర్శి (పర్యావరణం), అదనపు ముఖ్య కార్యదర్శి (వ్యవసాయం)లకు సంజాయిషీ నోటీసులు జారీ చేసినట్లు ఎఎస్‌జి వెల్లడించారు. ’10 రోజుల్లోగా సెక్షన్ 15ను పూర్తిగా ఆచరణయోగ్యం చేస్తాం’ అని ఎఎస్‌జి తెలిపారు. ‘ఆ ప్రభుత్వాలు, మీరు (కేంద్రం) పర్యావరణ పరిరక్షణకు నిజంగా సిద్ధంగా ఉంటే సెక్షన్ 15కు సవరణకు ముందే సర్వం జరిగి ఉండేది. ఇది అంతా రాజకీయం తప్ప మరేమీ కాదు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. దేశ రాజధానిలో వాయు నాణ్యత ‘అత్యంత పేలవం’ కేటగరీగా నమోదైంది. పలు ప్రాంతాలు బుధవారం ‘అధ్వాన’ మండలంపరిధిలోకి వచ్చాయి. శీతాకాలం ప్రవేశంతో, హర్యానా, పంజాబ్‌లలో పంట వ్యర్థాల దగ్ధాన్ని ఢిల్లీలో కాలుష్య స్థాయిల పెరుగుదలకు ప్రధాన కారణంగా పరిగణిస్తున్నారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు హాజరైన పంజాబ్, హర్యానాలపై సుప్రీం కోర్టు దృష్టి మరలుస్తూ, పంట వ్యర్థాల దగ్ధం అంతానికి అవిచేస్తున్న కృషి ‘కంటితుదుపు మాత్రమే’ అని అన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News