Wednesday, October 9, 2024

పరువునష్టం కేసులో సిఎం ఆతిశీ, కేజ్రీవాల్ కు సుప్రీంలో ఊరట

- Advertisement -
- Advertisement -

పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, ఆప్ అధినేత కేజ్రీవాల్ కు సోమవారం సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి కింద కోర్టులో విచారణపై స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ ఓటర్ల జాబితా నుంచి పలువురి పేర్లను తొలగించారంటూ వీరు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. ఇది 2018 నాటి కేసు. అప్పుడు ఆప్ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ , బీజేపీ ఆదేశాలతో వివిధ వర్గాలకు చెందిన 30 లక్షల మంది ఓటర్ల పేర్లను ఢిల్లీ ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. దీనిపై బీజేపీ నేత రాజీవ్ బబ్బర్ తమ పార్టీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందని ఫిర్యాదు చేశారు. దీనిపై ఆతిశీ, కేజ్రీవాల్‌కు 2019లో ట్రయల్ కోర్టు నోటీసులు ఇచ్చింది. వాటికి వ్యతిరేకంగా ఆప్ నేతలు సెషన్స్ కోర్టును , హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలుసుకునే హక్కు ఉందని, ఈ తరహా అసత్య ప్రచారాలను అనుమతించరాదంటూ పరువునష్టం కేసును కొట్టివేయడానికి నిరాకరించింది.

దాంతో వారు సుప్రీంను ఆశ్రయించగా విచారణపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే తమ స్పందన తెలియజేయాలని ఢిల్లీ పోలీసులను, రాజీవ్ బబ్బర్‌ను ఆదేశించింది. యూపీలో పని ఒత్తిడితో ఉద్యోగి ఆత్మహత్య
లఖ్‌నవూ : ఉత్తరప్రదేశ్ లోని ఓ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న ఒక వ్యక్తి పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాదాపు 45 రోజులుగా నిద్రపోకుండా పనిచేశానని, ఒత్తిడి కారణం గానే చనిపోతున్నానని సూసైడ్ లేఖలో తెలియజేశాడు. ఉత్తరప్రదేశ్‌లో ఝాన్సీకి చెందిన తరుణ్ సక్సేనా (42) ఓ ఫైనాన్స్ కంపెనీలో ఏరియా మేనేజర్‌గా పని చేస్తున్నారు. అయితే టార్గెట్‌లు పెడుతూ తనపై ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. పనిని సమయానికి పూర్తి చేయకుంటు జీతాన్ని కుదిస్తామని బెదిరించేవారు. దీంతో 45 రోజులు నిద్ర మానేసి మరీ పనిచేశారు. తమ సమస్య గురించి సీనియర్లకు వివరించినా, పట్టించుకోలేదు.

తీవ్ర ఒత్తిడికి గురైన తరుణ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యకు రాసిన ఐదు పేజీల సూసైడ్ నోట్‌లో తన ఆత్మహత్యకు గల కారణాలు వివరించారు. పోలీస్‌లు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. బాధిత కుటుంబం నుంచి ఫిర్యాదు అందితే దర్యాప్తు చేపడతామని సీనియర్ పోలీస్ అధికారి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News