Tuesday, May 14, 2024

సిబిఎస్‌ఇ పరీక్షలపై రేపు సుప్రీంలో విచారణ

- Advertisement -
- Advertisement -

Supreme Court to hear CBSE exams tomorrow

 

నూఢిల్లీ: సిబిఎస్‌ఇతోపాటు పలు ఇతర బోర్డులు నిరహించే 10వ తరగతి, 12వ తరగతి ఆఫ్‌లైన్ బోర్డు పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. పిటిషన్‌కు చెందిన ప్రతులను సిబిఎస్‌ఇ, ఇతర ప్రతివాదులకు చెందిన న్యాయవాదులకు ముందుగా అందచేయాలని జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. అత్యవసరంగా ఈ పిటిషన్‌పై విచారణ జరపాలని పిటిషనర్లు అర్థించడంతో జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై బుధవారం చేపట్టాలని నిర్ణయించింది. ఏప్రిల్ 26న 10, 12 తరగతుల కోసం టెర్మ్ టూ బోర్డు పరీక్షలను నిర్వహించాలని సిబిఎస్‌ఇ నిర్ణయించగా ఆఫ్‌లైన్ పద్ధతిలో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News