Wednesday, July 16, 2025

ప్రియురాలి కుమారుడిని పొడిచి చంపిన ప్రియుడు?

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లోని  సూరారం పోలీస్ స్టేషన్ పరిదిలో కత్తిపోట్ల కలకలం సృష్టించాయి. ప్రియురాలి కుమారుడిని ప్రియుడు కత్తితో పొడిచి చంపినట్టు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  సయ్యద్ డానిష్ అనే వ్యక్తి తన తల్లితో కలిసి ఉంటున్నారు. డానిష్ ను బిలాల్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. డానిష్ తల్లితో బిలాల్(30)కి ఉన్న అక్రమసంబంధమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు జగద్గిరిగుట్ట నివాసితులేనని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

 

Suraram Police Station in Qutubullapur

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News