Friday, July 11, 2025

సురేశ్ గోపి రాజీనామా చేయబోవడం లేదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేరళలోని త్రిస్సూర్ నుంచి గెలిచిన బిజెపి అభ్యర్థి, ప్రముఖ మలయాళీ నటుడు సురేశ్ గోపి ఆదివారం కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ ఒక్క రోజు గడువక ముందే తన మంత్రి పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు మలయాళీ మీడియా కథనం. ఆయనకు పూర్తి స్థాయి మంత్రి పదవి ఇవ్వకుండా సహాయ మంత్రి పదవిని ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని వినికిడి. చేయాల్సిన సినిమాలు ఉన్నందున తనను పదవి నుంచి రిలీవ్ చేయాలని మొరపెట్టుకున్నట్లు కథనం.

అయితే బిజెపి ఎంపీ ‘‘నేను ఇప్పటికే మంత్రి పదవిని అంగీకరించాను. పైగా ప్రమాణస్వీకారం కూడా చేశాను ’’ అంటూ వస్తున్న కథనాలను తిరస్కరించారు. ఆయన స్వయంగా సిఎన్ బిసి –టివి 18 కి  తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News