Friday, April 26, 2024

ఐసిసి టి20 ర్యాంకింగ్స్: సూర్యకుమార్ @ 2

- Advertisement -
- Advertisement -

Suryakumar Yadav moves up to No. 2 in ICC T20 rankings

అగ్రస్థానంలోనే రిజ్వాన్

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచిన సూర్యకుమార్ తాజా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలను మెరుగు పరుచుకుని రెండో ర్యాంక్‌లో నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను మూడో ర్యాంక్‌కు నెట్టేశాడు. బాబర్ ఒక ర్యాంక్‌ను కోల్పోయి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక సూర్యకుమార్ 801 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. కిందటి ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ నాలుగో ర్యాంక్‌లో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ మహ్మద్ రిజ్వాన్ తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు.

రిజ్వాన్ 861 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ ఐడెన్ మార్‌క్రామ్ నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. అయితే అరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) తన ఐదో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 13వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇక మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక ర్యాంక్‌ను మెరుగుపరుచుకుని 15వ స్థానానికి చేరుకున్నాడు. బౌలింగ్ విభాగంలో జోష్ హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. తబ్రేస్ షంసి (సౌతాఫ్రికా) రెండో, ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్) మూడో ర్యాంక్‌కు నిలబెట్టుకున్నాడు. రషీద్ ఖాన్ (అఫ్గాన్) నాలుగో ర్యాంక్‌లో నిలిచాడు. వనిండు హసరంగా (శ్రీలంక) టాప్5లో చోటు సంపాదించాడు. ఇక భారత సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పదో ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News