Saturday, June 3, 2023

కాప్రాలో ఎన్ఆర్ఐ సాఫ్ట్‌వేర్ అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

Suspicious death of NRI Software in Secunderabad

హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని కాప్రాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇంట్లోంచి దుర్వాసన రావడంతో స్థానికులు తలుపులు పగలగొట్టి చూశారు. ఇంట్లో కుళ్లిన స్థితిలో ఎన్ఆర్ఐ ముక్కిరాల సురేశ్ (50) మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. సురేష్ అమెరికాలోని టెక్సాస్ లో సాఫ్ట్ వేర్ గా స్థిరపడ్డాడు. అమెరికాలో నుంచి 45 రోజుల క్రితం మృతుడు హైదరాబాద్ కు వచ్చినట్లు ప్రాథమిక విచారణలో తెలిందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News