Monday, April 29, 2024

అందాలు అదరహో..

- Advertisement -
- Advertisement -

సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ సిరీస్ అరణ్మనై 4, తెలుగులో బాక్ పేరుతో వస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్స్. మేకర్స్ ఇటీవల అన్ని ప్రధాన పాత్రలు ఫస్ట్ లుక్ పోస్టర్‌లను విడుదలతో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘పంచుకో’ అనే ప్రోమో సాంగ్‌ను విడుదల చేశారు. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ పాటలో తమన్నా, రాశీఖన్నాల గ్రేస్ ఫుల్ మూమెంట్స్, ముఖ్యంగా హిప్ మూమెంట్స్ చూడటానికి ఒక ట్రీట్‌గా వున్నాయి.

ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరించి, హీరోయిన్‌లు ఇద్దరూ అందాలతో అదరగొట్టారు. ప్రోమో సాంగ్‌లో సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను కూడా చూపించారు. అవ్నీ సినిమాక్స్ పిఎల్‌టిడి పతాకంపై ఖుష్బు సుందర్, ఎసిఎస్ అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News