Tuesday, September 16, 2025

తమిళనాడు మాజీ డిజిపి రాజేష్ దాస్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

అక్రమ చొరబాటు, వేధింపులకు పాల్పడినట్లు వేరుపడిన తన బీలా వెంకటేశన్ ఇచ్చిన ఫిర్యాదుపై తమిళనాడు మాజీ ప్రత్యేక డిజిపి రాజేష్ దాస్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మే 18న నగర శివార్లలోని తైయూర్‌లోగల తన ఇంట్లోకి దాస్, ఆయన అనుచరులు సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి చొరబడ్డారని రాష్ట్ర ఇంధన కార్యదర్శిగా పనిచేస్తున్న బీలా వెంకటేశన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బీలా వెంకటేశన్ సోమవారం ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి దాస్‌ను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. గత ఎఐఎడిఎంకె పాలనలో ప్రత్యేక డిజిపిగా దాస్ పనచిఏశారు. ఒక జూనియర్ ఐపిఎస్ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు దాస్‌కు గత ఏడాది విల్లుపురంలోని కోర్టు మూడేళ్ల కారాగార శిక్ష విధించింది. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఆయనకు అరెస్టు నుంచి తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News