Monday, June 17, 2024

నేడైనా హైదరాబాద్ జట్టు సత్తా చాటేనా?

- Advertisement -
- Advertisement -

నేడే చెన్నై ఎంఏ. చిదంబరం స్టేడియంలో రెండో క్వాలిఫయర్ మ్యాచ్

రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ! 

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓ ప్రత్యేకత ఉంది. 200 ప్లస్ స్కోరు చేసిన తొలి టీమ్ ఇదే. ఐపిఎల్ లో అత్యధిక స్కోరు రికార్డును రెండు సార్లు బ్రేక్ చేసిన టీమ్ కూడా ఇదే. 215 పరుగులను ఛేదించి ఫస్ట్ క్వాలిఫయర్ అయింది కూడా. ఇప్పుడు సన్ రైజర్స్ జట్టు గత రోజు రెండో స్థానం సాధించిన  రాజస్థాన్ రాయల్స్ తో తలపడనున్నది. ఆ జట్టు రెండో క్వాలిఫయర్ గా ఉంది. హైదరాబాద్ జట్టు గట్టిగా ఆడితే తప్ప రాజస్థాన్ రాయల్స్ ను మట్టికరిపించలేదు. ఎందుకంటే ఎలిమినేటర్ రౌండ్ లో ఆ జట్టు క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించి ఈ స్థాయికి వచ్చింది.

రన్ రేట్ ప్రకారం చూస్తే రాజస్థాన్ రాయల్స్ కన్నా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకే రన్ రేట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపిఎల్ సెకండ్ టైటిల్ కోసం తలపడనున్నారు. చూద్దాం… హైదరాబాద్ జట్టు అసలు ఈ రోజైనా నిలబడుతుందా లేదా అన్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News