Tuesday, October 15, 2024

హోటల్ చైన్ యజమాని వీడియోపై రాహుల్ ఆక్షేపణ

- Advertisement -
- Advertisement -

జిఎస్‌టి గురించి ఆందోళన వ్యక్తం చేసినందుకు ఒక రెస్టారెంట్ చైన్ యజమాని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ‘క్షమాపణ చెబుతున్నట్లుగా’ పేర్కొంటున్న ఒక వీడియోపై ప్రభుత్వాన్ని లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం తీవ్రంగా విమర్శించారు. అధికారంలో ఉన్నవారి ‘అహం’ దెబ్బ తింటే ఆ విధంగానే కించపరుస్తుంటారని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు పలువురు రెండు వీడియోలు పంచుకుంటున్నారు. వాటిలో ఒకడానిలో ఈ నెల 11న అన్నపూర్ణ రెస్టారెంట్ల చైన్ యజమాని శ్రీనివాసన్ రకరకాల జిఎస్‌టి రేట్ల గురించి ఆందోళన వ్యక్తం చేస్తుండడం కనిపించింది. రెండవ వీడియోలో శ్రీనివాసన్ స్వయంగా ఆర్థిక శాఖ మంత్రికి క్షమాపణ చెబుతుండడం కనిపించింది. ఈ ‘మొండి ప్రభుత్వం’ ప్రజల మాటలను ఆలకిస్తుంటే సరళీకృత జిఎస్‌టి లక్షలాది వాణిజ్య సంస్థల సమస్యలను పరిష్కరిస్తుందని అర్థం చేసుకుంటుందని రాహుల్ అన్నారు.

కోయంబత్తూరులోని అన్నపూర్ణ రెస్టారెంట్ వంటి చిన్న వ్యాపార సంస్థ యజమాని సరళీకృత జిఎస్‌టి వ్యవస్థ కోసం ప్రభుత్వోద్యోగులను అడిగినప్పుడు ఆయన వినతికి మొండితనం, అమర్యాదు ఎదురయ్యాయి’ అని రాహుల్ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘అయితే. కోటీశ్వరుడైన ఒక మిత్రుడు నిబంధనల వక్రీకరణకు, చట్టాల మార్పునకు లేదా జాతీయ ఆస్తుల కొనుగోలును కోరుకుంటూ మోడీజీ ఎర్ర తివాచీ పరుస్తుంటారు’ అని ఆయన ఆరోపించారు. ‘పెద్ద నోట్ల రద్దు, అందుబాటులో లేని బ్యాంకింగ్ వ్యవస్థ, పన్ను డోపిడీ, వినాశకర జిఎస్‌టి దెబ్బలను మన చిన్న వాణిజ్య సంస్థల యజమానులు ఇప్పటికే ఎదుర్కొన్నారు, మరిన్ని అవమానాలు ఎదురుకాకూడదనే వారు చివరగా వాంఛించేది’ అని రాహుల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

‘అధికారంలో ఉన్నవారి అహాలు దెబ్బ తిన్నప్పుడు వారు వదిలేది అటువంటి అవమానాలనే’ అని రాహుల్ అన్నారు. ఎంఎస్‌ఎంఇలు ఏళ్ల తరబడి వెసులుబాటు కోసం అడుగుతున్నాయని ఆయన తెలిపారు. ‘ఈ మొండి ప్రభుత్వం ప్రజల వాణి వింటుంటే ఒకే పన్నుతో సరళీకృత జిఎస్‌టి లక్షలాది వాణిజ్య సంస్థల సమస్యలు పరిష్కారం అవుతాయి’ అని రాహుల్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News