Friday, December 6, 2024

రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

చెన్నై: రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్‌ఐ, కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన తమిళనాడులోని మదురాంతకంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మాధవరం పోలీస్ స్టేషన్‌లో జయ శ్రీ అనే మహిళ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఓ దొంగతనం కేసులో విచారణ కోసం నిత్య అనే కానిస్టేబుల్‌తో కలిసి ఎస్‌ఐ జయశ్రీ బైక్‌పై వెళ్తున్నారు. మదురాంతకం చేరుకోగానే కారు అతివేగంగా వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టడంతో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఘటనా స్థలంలోనే చనిపోయారు. మదురాంతకం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News