Friday, June 6, 2025

రఫెల్ బాడీ.. ఇక్కడే తయారీ

- Advertisement -
- Advertisement -

 టాటా అడ్వాన్స్‌డ్
సిస్టమ్, రఫెల్
మాతృసంస్థ డసో
మధ్య ఒప్పందం
హైదరాబాద్‌లో
అత్యాధునిక
తయారీ ప్లాంట్
ఏర్పాటుకు అంగీకారం
ఏడాదికి రెండు
ఫ్యూజ్‌లేజ్‌ల తయారీ
ఫ్రాన్స్ వెలుపల
రఫెల్ విడిభాగాల
తయారీ ఇదే తొలిసారి

మన తెలంగాణ/హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ త ర్వా త భారత డిఫెన్స్ రంగంలో పెద్ద మార్పులు వస్తున్నా యి. ఇప్పటికే అనేక దేశాల నుంచి ఇండియన్ డిఫెన్స్ సంస్థలకు ఆర్డర్లు వస్తుండగా రఫెల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ డసో ఏవియేషన్ హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి కేం ద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే భారత వైమానిక దళంలో కీలకంగా వ్యవహారిస్తు న్న రఫేల్ యుద్ధవిమానాల తయారీకి సంబంధించి టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్, ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్ సంస్థల మధ్య కీలక ఒప్పందం కుదిరిం ది. రఫేల్ యుద్ధ విమానాలకు చెందిన ప్రధాన భాగాలు హైదరాబాద్‌లో తయారు చేయాలని ఈ రెండు సంస్థలు ఒప్పందానికి వచ్చాయి. రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలు ఫ్రాన్స్‌కు వెలుపల తయారు కావడం ఇదే మొదటిసారి. ఏరోస్పేస్ రంగంలో భారత్ గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని చెప్పడానికి తాజా ఒప్పందమే ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. భారత అమ్ములపొదిలో చేరిన రఫెల్ యుద్ధ విమానాలు ఎంత శక్తివంతమైనవో మనందరికీ తెలిసిందే. మరికొన్ని రఫెల్స్ ఫ్రాన్స్ నుంచి అందాల్సి ఉంది. అయితే, తాజాగా మేక్ ఇన్ ఇండియాలో తాము కూడా భాగస్వామి గా కావాలని నిర్ణయించిన డసో ఏవియేషన్స్ సంస్థ టాటా అడ్వానస్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది.

దీని కింద హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న ఫెసిలిటీలో కంపెనీ రఫెల్ యుద్ధ విమానాల ‘ఫ్యూజ్‌లేజ్’ల (విమానం ప్రధాన బాడీ) తయారీకి ముందుకొచ్చింది. మెు ద టి సారిగా డసో ఏవియేషన్ రఫెల్ యుద్ధ విమానాల ‘ఫ్యూజ్‌లేజ్’లను ఫ్రాన్స్ బయట తయారు చేయాలనుకోవటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. టాటాలతో జరిగిన ఒప్పందం ప్రకారం టాటా అడ్వానస్డ్ అత్యాధునిక ఉత్పత్తి కర్మాగారాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఇక్కడ రఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన కీలకమై న స్ట్రక్చరల్ భాగాలను తయారు చేయనున్నారు. ప్రధానం గా యుద్ధ విమానానికి సంబంధించిన బాడీ మధ్య భాగం, వెనుక భాగం, ముందు భాగం హైదరాబాద్‌లో నిర్మిస్తారు. 2028 నాటికి ఈ అసెంబ్లింగ్ లైన్ అందుబాటులోకి వ స్తుందని డసాల్ట్ ప్రకటించింది. దీని నుంచి నెలకు రెండు ‘ఫ్యూజ్‌లేజ్’లను డెలివరీ చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే టాటాలు బోయింగ్ విమానాలకు సంబంధించిన బాడీలను హైదరాబాద్ ఫెసిలిటీలో తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిణామాలు భారత ఏరోస్పేస్ రంగంలో కొత్త చరిత్రకు ప్రారంభమని టాటా అడ్వానస్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అధికారులు పేర్కొంటున్నారు. పైగా టాటా సంస్థలకు ప్రపంచ వ్యాప్తంగా నమ్మకాన్ని పెంచుతోందని వారంటున్నారు. ప్రస్తుతం భారత వైమానిక దళంలో 36 రఫెల్ జెట్ విమానాలు దేశ భద్రత సేవల్లో కొనసాగుతున్న తరుణంలో ఈ డీల్ రావటం విశేషం.

ఈ ఒప్పందం ఓ మైలురాయిగా నిలుస్తుంది: సిఎండి
భారత రక్షణ రంగ చరిత్రలో ఈ ఒప్పందం ఓ మైలురాయిగా నిలుస్తుందని టాటా అడ్వానస్డ్ సిస్టమ్స్ లిమిటెట్ సిఎండి సుకరన్ సింగ్ తెలిపారు. డసో ఏవియేషన్ సంస్థతో చేసుకున్న ఈ ఒప్పందం టాటా అడ్వానస్డ్ సిస్టమ్స్ సామర్థ్యాలను గుర్తు చేస్తుందన్నారు.
భారతదేశ వైమానిక వ్యవస్థ అభివృద్ధి, పురోగతిని ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుందని అన్నారు. ఇప్పటికే టాటా అడ్వానస్డ్ సిస్టమ్స్ ఎయిర్ బస్, బో యింగ్ కంపెనీల విడి భాగాలు తయారు చేస్తోంది. మరోవైపు యుద్ధ విమానాల తయారీ దిశగా హైదరాబాద్ పరిశ్రమలు ముందడుగు వే శాయి. తేజస్ మార్క్-1ఏలో 5 భాగాలు ఉంటే అందులో మధ్య భాగా న్ని హైదరాబాద్‌లోని వెమ్ టెక్నాలజీస్ డెవలప్ చేసింది. ప్రస్తుతం మ రింత అధునాతన తేజస్ మార్క్-1ఏ కి మధ్య భాగాన్ని సిద్ధం చేశారు. మొదటి ఉత్పత్తిని మే 30న హెచ్‌ఏఎల్క్ అందజేశారు.

2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాల ఉత్పత్తి యుద్ధ విమానాల తయారీలో మరింత వేగం పెంచేందు కు ఈ ఒప్పందం దోహదపడనుందని ఆయన తెలిపారు. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో టాటా అడ్వానస్డ్ సిస్టమ్స్ సంస్థ ఏర్పాట్లు చేయనుందన్నారు.
ఇది నిర్ణయాత్మక అడుగు: డసో ఏవియేషన్ చైర్మన్
భారత్‌లో తమ ఉత్పత్తిని బలోపేతం చేయడంలో ఇది నిర్ణయాత్మక అ డుగని డస్టాల్ ఏవియేషన్ చైర్మన్ అండ్ సిఈఓ ఎరిక్ ట్రాపియర్ తెలిపారు. భారత రక్షణ రంగంలో తమ సేవలను విస్తరిస్తున్నందుకు ఆ యన ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం రఫేల్ విస్తరణకు మరింత దోహదం చేస్తుందని, అంతేకాకుండా నాణ్యమైన సేవలు అందిస్తూ సైనిక అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News