Saturday, July 27, 2024

టిసిఎస్ లాభం రూ.11,074 కోట్లు

- Advertisement -
- Advertisement -

గతేడాదితో పోలిస్తే 17 శాతం వృద్ధి
 రూ.59,381 కోట్లకు పెరిగిన ఆదాయం
 షేరుకు రూ.9 చొప్పున తుది డివిడెండ్

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (202324) జూన్ ముగింపు నాటి మొ దటి త్రైమాసిక ఫలితాల్లో టిసిఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) రాణించింది. కంపెనీ నికర లాభం రూ.11,074 కోట్లతో 16.8 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.9,478 కో ట్లుగా ఉంది. అయితే ఇంతకుముందు క్యూ4(జనవరిమార్చి) త్రైమాసికంలో నికర లాభం రూ.11,392 కోట్లతో పోలి స్తే ఈసారి లాభం 2.7 శాతం తగ్గింది. ఇక ఐటి దిగ్గజం ఆదాయం 12.5 శాతం పెరిగి రూ.59,381 కోట్లు నమోదు చేసింది. గతేడాదిలో ఈ ఆదాయం రూ.52,758 కోట్లుగా ఉంది. కంపెనీ రూ.1 ముఖ విలు వ షేరుకు మధ్యంత డివిడెండ్ రూ.9 చొ ప్పున ప్రకటించింది.

టిసిఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్(సిఇఒ) కె.కృతివాసన్ మాట్లాడుతూ, డీల్ విజయాలతో కొత్త ఆర్థిక సంవత్సరం చాలా సంతృప్తికరంగా ప్రా రంభమైందని అన్నారు. కొత్త సాంకేతికతతో తమ సేవలకు దీర్ఘకాలిక డిమాండ్ ప ట్ల చాలా విశ్వాసంతో ఉన్నామని అన్నా రు. కొత్త టెక్నాలజీలు, పరిశోధనలు, ఆవిష్కరణల నిర్మాణానికి ప్రారంభంలోనే పె ట్టుబడులు పెడుతున్నామని ఆయన అన్నా రు. కంపెనీ అట్రిషన్ 17.8 శాతం వద్ద ఉంది. క్యూ1(ఏప్రిల్‌జూన్)లో దాదాపు 523 మంది ఉద్యోగులను కంపెనీ నియమించుకుంది. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో టిసిఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) షేరు విలువ రూ.0.35 శాతం ప డిపోయి రూ.3,260.95 వద్ద స్థిరపడింది.

హెచ్‌సిఎల్ టెక్ లాభం 7.6% జంప్
క్యూ1(జనవరిమార్చి) త్రైమాసిక ఫలితాల్లో ఐటి సేవల సంస్థ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ నికర లాభం వార్షికంగా 7.6 శా తం పెరిగి రూ.3,534 కోట్లు నమోదు చే సింది. గత త్రైమాసికం(క్యూ4 : జనవరిమార్చి)తో పోలిస్తే ఈసారి లాభం 11.2 శాతం క్షీణించింది. కన్సాలిడేటెడ్ రెవెన్యూ రూ.23,464 కోట్ల నుండి రూ.26,296 కోట్లతో 12 శాతం పెరిగింది. 202324 ఆర్థిక సంవత్సరానికి కరెన్సీ రెవెన్యూ వృద్ధి 6 నుంచి 8 శాతం నమోదు చేసింది. ఈ క్విటీ షేరుకు రూ.10 చొప్పున డివిడెండ్ నిర్ణయానికి కంపెనీ బోర్డు డైరెక్టర్లు ఆమో దం తెలిపారు. రికార్డు తేదీ జులై 20గా నిర్ధారించారు. స్టాక్‌మార్కెట్లో హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ షేరు విలువ 0.76 శాతం తగ్గి రూ.1,106 వద్ద ట్రేడ్ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News