Friday, April 19, 2024

సర్, మేడమ్ కాదు.. ‘టీచర్’ అనే సంబోధించాలి

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : కేరళ పాఠశాలలో ఉపాధ్యాయులను సార్, మేడమ్ పదాలతో సంభోదించకూడదని నిర్ణయించారు. ఇక నుంచి ఉపాధ్యాయులను ‘టీచర్’ అని మాత్రమే పిలవాలని కేరళ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ విద్యాశాఖను ఆదేశించింది.

ఉపాధ్యాయులను సర్, మేడమ్ వంటి గౌరవ ప్రదమైన పదాల కంటే లింగ బేధంతో సంబంధ లేకుండా తటస్థంగా ఉండే పదంతోనే సంబోధించాలని నిర్ణయించింది. అదే విధంగా పాఠశాలల్లో పిల్లల మధ్య సమానత్వాన్ని కొనసాగించడంలో ఉపకరిస్తుందని, టీచర్లు, పిల్లల నడుమ అనుబంధాన్ని కూడా పెంచుతుందని బాలల హక్కుల కమిషన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News