Saturday, April 20, 2024

నాడు తెలంగాణకోసం.. నేడు దేశం కోసం కేసిఆర్

- Advertisement -
- Advertisement -

వ్యవసాయరంగాన్ని సుభిక్షం చేయటమే లక్ష్యం
మంత్రి నిరంజన్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్:  నాడు ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో అన్ని విధాల అన్యాయానికి గురైన తెలంగాణ ప్రజలకోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించిన సిఎం కేసిర్ నేదు దేశం కోసం ముదుకు సాగుతున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం రైతుబంధు సథకానికి రూ. 550.14 కోట్లు విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నిధులు 1,60,643 మంది రైతుల ఖాతాలలో నిధులు జమ చేయటం జరిగిందన్నారు.11లక్షల 306.38 ఎకరాలకు ఈ నిధులు పెట్టుబడి సాయంగా అందించామన్నారు.

రాష్ట్రంలో యాసంగి పంటల సాగుకు పెట్టుబడిగా ఇప్పటివరకూ ఈపథకం కింద మొత్తం 62 లక్షల 45 వేల 700 మంది రైతుల ఖాతాలలో రూ.6351.22 కోట్లు జమ చేసినట్టు వివరించారు. ఖమ్మం బీఆర్‌ఎస్ బహిరంగసభ నవశకానికి నాంది పలకబోతున్నదన్నారు. దేశ రాజకీయ చరిత్రలో ఒకమలుపురాయిలా నిలవనున్నదన్నారు. ఖమ్మం సభలో కేసీఆర్ సందేశం చారిత్రాత్మకం కానున్నదని తెలిపారు. నాడు తెలంగాణ కోసం నేడు దేశం కోసం కేసీఆర్ ముందడుగు వేశారన్నారు. తెలంగాణ మాదిరిగానే దేశం సస్యశ్యామలం కావాలన్నారు.

60 శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగం సుభిక్షంగా వర్దిల్లాలన్నారు. అన్ని రంగాలను అమ్మేసినా కేంద్ర ప్రభుత్వం కన్ను ఇప్పుడు ఆహారరంగం మీద పడిందని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో కేంద్రం కుట్రలను చేధిస్తామని హెచ్చరించారు. తెలంగాణ వ్యవసాయ పథకాలు, సంక్షేమ పథకాలు దేశమంతా అమలుకావాలని భారత ప్రజలు ఆశిస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ అడుగులు చూసి బీజేపీలో వణుకు పుడుతున్నదన్నారు. అందుకే తెలంగాణ మీద కక్ష్యగట్టి నిధులు రాకుండా, రుణాలు అందకుండా అడ్డుపుల్లలు వేస్తున్నదని విమర్శించారు. బీజేపీకి ప్రజలే సమాధానం చెబుతారని మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News