Monday, April 29, 2024

జనసేన ఆశలు ఆవిరి!

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠరేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేనపార్టీ ఆశలు ఆవిరయ్యాయి. భారతీయ జనతాపార్టీతో పొత్తు పెట్టుకుని ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేసిన జనసేనపార్టీ అభ్యర్ధులకు ఒక్కచోట కూడా విజయావకాశాలు కనిపించలేదు. పార్టీ అధ్యక్షుడు సినీనటుడు పవన్ కళ్యాణ్ స్వయంగా పార్టీ అభ్యర్ధుల విజయం కోసం ప్రచారం నిర్వహించినప్పటీకి శ్రమకు తగిన ఫలితం అందుకోలేకపోయారు.

కనీసం సెట్లర్స్ ఓట్లు అధికంగా ఉన్నాయని భావించే కూకట్‌పల్లి నియోజకవర్గంలో నైనా విజయంపై ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ అధినేతకు అక్కడ కూడా పరాయజం తప్పలేదు.ఈ ఎన్నికల్లో సినీగ్లామర్ ఏ మాత్రం పనిచేయలేదు. పార్టీ పరాజయం పాలవటంతో జనసేన పార్టీ ప్రాధానకార్యాలయం వెలవెలబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News