Friday, July 18, 2025

21న బి.ఆర్క్ ప్రవేశాలకు నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్(బి.ఆర్క్) కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి నేతృత్వంలో గురువారం సమావేశమైన బి.ఆర్క్ ప్రవేశాల కమిటీ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ నెల 21న బి.ఆర్క్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడదుల చేసి చేయనున్నట్లు బి.ఆర్క్ ప్రవేశాల కన్వీనర్ ఎస్.కుమార్ తెలిపారు. ఈనెల 23 నుంచి ఈ నెల 31 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఆగస్టు 16 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించి, ఆగస్టు 20న తొలి సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 24 నుంచి రెండో విడత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News