Saturday, September 30, 2023

కండక్టర్ ఆత్మహత్యయత్నం..

- Advertisement -
- Advertisement -

మెదక్: ఆర్ టిసి కండక్టర్ ఆత్మహత్యయత్నం చేసుకున్న సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని నర్సాపూర్ బస్ డిపోలో కండక్టర్ సాయితేజ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో సాయితేజ తీవ్రంగా గాయపడ్డాడు. తోటి ఉద్యోగులు చికిత్స నిమిత్తం సాయితేజని సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సాయిరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసపత్రి వర్గాలు తెలిపాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News