Friday, July 19, 2024

తెలంగాణ డిజిపిగా జితేందర్ నియామకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ డిజిపిగా సీనియర్ ఐపిఎస్ అధికారి జితేందర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన డిజిపి హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన స్థానంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవి గుప్తాను బదిలీ చేశారు. జితేందర్ 1992 ఐపిఎస్ బ్యాచ్ కు చెందినవారు. డిజిపి జితేందర్ స్థ్వస్థలం పంజాబ్ లోని జలంధర్ ప్రాంతం. గతంలో నిర్మల్, బెల్లంపల్లి ఎఎస్ పిగా సేవలందించారు. మహబూబ్ నగర్, గుంటూరు ఎస్పిగా జితేందర్ పని చేశారు. ఆయన సిబిఐలో పని చేయడంతో పాటు గేహౌండ్స్ బాధ్యతలు కూడా నిర్వహించారు.

తెలంగాణ డిజిపిగా నియమితులైన సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా సీనియర్ ఐపిఎస్ అధికారి జితేందర్ కలిశారు. వచ్చే సంవత్సరం సెప్టెంబర్‌ వరకు ఆయన పదవీలో ఉండనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News