Saturday, September 23, 2023

జిహెచ్‌ఎంసిలో ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / సిటీ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో శుక్రవార ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. అనంతరం మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ లోకేష్ కుమార్లు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఈవిడిఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్లు ప్రి యాంక అలా, సరోజ, విజయలక్ష్మి, జయరాజ్ కెనడి, యాదగిరి రావు, సిసిపి దేవేందర్‌రెడ్డి, అడిషనల్ సిసిపి శ్రీనివాస రా వు, ఈఎన్‌సి జియాఉద్దీన్, ప్రాజెక్ట్ సిఈ దేవానంద్, హౌజింగ్ ఎస్‌ఈ విద్యాసాగర్, ప్రాజెక్ట్ ఎస్‌ఈలు వెంకట రమణ, రవీందర్ రాజు, ఎస్‌డబ్లూ ఎం.కోటేశ్వరరావు, చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్. రాంబాబు, చీఫ్ వెటర్నరీ డా.అబ్దుల్ వకీల్, సిఎంహెచ్‌ఓ డా.పద్మజ, జాయింట్ కమిషనర్లు శశికళ, సంధ్య, ఉమా ప్రకాశ్, స్పోర్ట్ డైరెక్టర్ బాషా, పిడి సౌజన్యతో పాలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ నెల 10 సుంచి అందుబాటులోకి వార్డు పరిపాలన వ్యవస్థ
జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సాలను ఉద్ధేశించిన మేయర్ మాట్లాడుతూ 21 రోజుల దశాబ్ది ఉత్సవాలో భాగంగా ఈనెల 10 నిర్వహించనున్న సుపరిపాలన దినోత్సవం సందర్భంగా గ్రేటర్‌లో వార్డు పారిపాలన వ్యవస్థ అందుబాటులోకి రానుందన్నారు. అంతకు ముందు ఆమె స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులుబాసిన అమరలందరికీ పేరు పేరునా జోహర్లు అర్పించారు. నీళ్లు నిధులు, నియమకాల కోసం మలిదశ స్వరాష్ట్ర సాధన ఉద్యమం 14 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం జరిగిందన్నారు. ఉద్యమ నాయకుడు కె.చంద్రశేఖరరావే ముఖ్యమంత్రి కావడంతో ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ది సంక్షేమ పథకాలను విన్నూత పద్దతిలో అమలు చేయడం ద్వారా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అదర్శంగా నిలిచిందన్నారు. గ్రేటర్‌లో మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన ప్రజా రవాణా కోసం ఆధునిక రోడ్డు వ్యవస్థ, సంక్షేమం, సామాజిక , ఆర్ధిక పరమైన అభివృద్దికి నగరవాసులకు జిహెచ్‌ఎంసి పూర్తి తోడ్పాటును అందిస్తోందని చెప్పారు.

అదేవిధంగా ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్షంగా ప్రజల ముంగిట్లో పరిపాలన అందించాలన్న పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఆలోచన మేరకు వార్డు పరిపాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రస్తుతం జిహెచ్‌ఎంసిలో ప్రధాన కార్యాలయం, జోనల్, సర్కిల్ ఇలా మూడంంచెల వ్యవస్థ ద్వారా పరిపాలన కొనసాగుతుందని, 10 వ తేదీ నుంచి నాల్గంచెల పరిపాలన అందుబాటులోకి రానుందని తెలిపారు. తద్వరా నగరవాసులకు మరింత సంతృప్తికరమైన సేవలను అందించేందుకు ఈ వ్యవస్థను తీసుకువస్తున్నామని ఇందులో భాగంగా 150 డివిజన్లలో ప్రతి డివిజన్‌లో వార్డు కార్యాలయం ఏర్పాటు చేస్తున్నమన్నారు. ప్రధాన విభాగాలైన పారిశుద్దం, ఎంటామాలజీ, జలమండలి, విద్యుత్, టౌన్ ప్లానింగ్ ఇలా 10 విభాగాలకు చెందిన సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. ఇందులో వార్డు పరిపాలన అధికారి ప్రధాన భూమికను పోషిస్తారని మేయర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News