Wednesday, October 9, 2024

ఉత్తమ్ అధ్యక్షతన ఎస్‌సి,ఎస్‌టి వర్గీకరణపై కమిటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై అధ్య యనం చేసిన నివేదిక సమర్పించడానికి తెలంగాణ ప్రభు త్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కమిటీని ఏ ర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి కో-చైర్మన్‌గా మంత్రి దామోదర రాజనర్సింహ వ్య వహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపి మల్లు రవి ఉంటారు. ఎస్‌సి, ఎస్‌టి వర్గీకరణ విషయంలో ఆగస్టు 1న పంజాబ్ రాష్ట్రం, దేవేందర్ సింగ్ ఇతరుల మధ్య కేసుకు సంబం ధించి ఏడుగురు జడ్జీల సుప్రీంకోర్టు బెంచి వెల్లడించిన తీర్పును, వర్గీకరణకు సంబంధించి ముడిపడి ఉన్న ఇతర అన్ని అంశాలను ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వా నికి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికను పరిశీలించాక వర్గీకరణ విషయంలో ప్రభుత్వ ఓ నిర్ణయం తీసుకోనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News