Wednesday, October 9, 2024

తాటాతీస్తాం

- Advertisement -
- Advertisement -

ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఉపేక్షించేది లేదు, తాటాతీస్తామని ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి హెచ్చరించారు. అరెకపూడిగాంధీ, కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై పరోక్షంగా స్పందించిన రే వంత్ రెడ్డి మా ఇంటికి వస్తామని బెదిరిస్తే, మా వారే వెళ్లి పనిపట్టారన్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్ సౌమ్యుడు అని ఎవరైనా తోకజాడిస్తే, ఆయన వె నుక నేనున్నానన్న విషయం మరచిపోవద్దని హె చ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి జోలికి రారని, మా జోలికి వస్తే వీపు చింతపండు చేస్తామని సిఎం హెచ్చరించారు. గాంధీభవన్‌లో టిపిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎఐసిసి కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కె.కేశవరావు, పార్టీ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు తదితరు లు పాల్గొన్నారు. సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్‌కు అధ్యక్ష బా ధ్యతలు అప్పజెప్పి పార్టీ పతాకాన్ని అందజేశారు. అనంతరం జరిగిన సభలో సిఎం మాట్లాడుతూ ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు, విజయాలు సెమీఫైనల్స్ మాత్రమేనని స్పష్టం చేశారు. 2029లో రాహుల్‌గాంధీని ప్రధానిగా చేసినప్పుడే మనం ఫైనల్స్‌లో విజయం సాధించినట్లు అని, అప్పటివరకు విశ్రమించవద్దని పిలుపునిచ్చారు.

1994 నుంచి రాష్ట్రంలో ప్రతిపార్టీ రెండుసార్లు చొప్పున గెలిచిందని, కాంగ్రెస్ కూడా కచ్చితంగా వరసగా రెండుసార్లు అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో పదేళ్లు అధికారం కాంగ్రెస్‌దేనని విశ్వాసం వ్య క్తం చేశారు. సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఏ ర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారన్నారు. ను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లానని, ఇంద్రవెల్లి నుంచి సమరశం ఖం పూరించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చామన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసామని, రూ.18వేల కోట్లు 23 లక్షల రై తుల ఖాతాల్లో వేసి వ్యవసాయం పండగ అని నిరూపించామని రేవంత్ అన్నారు. ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మొదటి రెండు గ్యారెంటీలను అమలు చేసామన్నారు. ఇప్పటి వరకు 85కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేశారని, రాజీవ్ ఆరోగ్యశ్రీని 10లక్షలకు పెంచి పేదలకు వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ పేదల ఇండ్లల్లో వెలుగులు నింపుతున్నామని చెప్పారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటున్నామని, ఇచ్చిన మాట ప్రకారం పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతుల కళ్లలో ఆనందం చూశామని సిఎం చెప్పారు. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాల్ విసిరారు,

రాజీనామా చేస్తానని చెప్పిన ఆ సన్నాసి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడు..? అని రేవంత్ రెడ్డి నిలదీశారు. రాబోయే పంట నుంచి సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పారు. కెసిఆర్, కెటిఆర్ ఉద్యోగాలు ఊడగొడితే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని పాదయాత్రలో చెప్పామని, వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టిన మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి మరో 35 వేల ఉద్యోగాలిస్తామని చెప్పారు. నిరుద్యోగులకు నైపుణ్యం అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దీక్ష పూనిందని, త్వరలో తెలంగాణలో స్పోరట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 2028లో ఒలింపిక్స్ లో దేశం తరపున బంగారు పథకాలు సాధించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చే దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు.

ముచ్చెర్లలో ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్లాలని, ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలంటే పూర్తి సమయాన్ని కేటాయించే పార్టీ అధ్యక్షుడు ఉండాలని అధిష్టానాన్ని కోరామని, రాబోయే మూడు నాలుగు నెలల్లో బిసి కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత నాయకులుగా మాపై ఉందని, మీ ఎన్నికలకు మా ఎన్నికల కంటే ఎక్కువ కష్టపడతామని కార్యకర్తనుద్దేశించి చెప్పారు. మహేష్ గౌడ్ తెలంగాణ పిసిసి అధ్యక్షుడుగా పదవీబాధ్యతలు చేపట్టడం మనందరికీ ఆనందదాయకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, కొర్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి… ఇంఛార్జి దీపా దాస్ మున్షీ.
మహేష్ కుమార్ గౌడ్ ను పిసిసి చీఫ్ గా నియమించి ఎఐసిసి మంచి నిర్ణయం తీసుకుందని ఎఐసిసి కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు ఎంతో కీలకమని అన్నారు. త్వరలో జరిగే స్థానికసంస్థల ఎన్నికలు పార్టీకి, నేతలకు సవాలు వంటివని వ్యాఖ్యానించారు. బిజెపి మతతత్వ రాజకీయాలపై పోరాడాలని అందరం సంకల్పం తీసుకుందామని అన్నారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో తాను కఠినంగానే ఉంటానని ఆమె స్పష్టం చేశారు.

సోనియా తెలంగాణ ఇస్తే .. కుటుంబ అవసరాలకు వాడుకున్న కెసిఆర్ : మహేష్ కుమార్ గౌడ్
గాంధీ భవన్ అనేది తనకు దేవాలయంతో సమానమని టిపిసిసి నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోనియా ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ తన సొంత అవసరాలకు, కుటుంబ అవసరాలకు వాడుకున్నారని మండిపడ్డారు. టిపిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ‘కాంగ్రెస్ పార్టీలో అందరికీ తగిన గుర్తింపు ఉంటుందని, దానికి తన నియామకమే సాక్ష్యమని అన్నారు. గతంలో కెసిఆర్ ఇబ్బంది పెట్టిన తీరును చూసే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతా కలిసి మాకు ఇంత పెద్ద అధికారాన్ని కట్టబెట్టారని అన్నారు. పార్టీలో ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కువ ఉంటుందని, పార్టీలో తాము వ్యక్తిగత విమర్శలు చేసుకున్నా.. తామంతా ఒకటేనని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు నాకు తగిన ప్రోత్సాహం ఇవ్వడం వల్లే ఇంత పెద్ద బాధ్యతలను చేపట్టగలిగాను‘ అని ఆయన అన్నారు.

రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్న ఆస్తులు ఎవరికి లేవన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సిఎం ను కోరారు. గాంధీ భవన్ ఉంటేనే ప్రభుత్వం ఉంటుందని, సిఎం కూడా నెలకు ఒక సారి గాంధీ భవన్ కు రావాలని, ప్రతి వారం ఇద్దరు మంత్రులు గాంధీభవన్‌కు రావాలని సూచించారు. ప్రభుత్వం నడపడమంటే, కెసిఆర్ మాదిరిగా ఫామ్ హౌస్ నుండి పరిపాలనను అందించడం కాదని, ప్రజలతో మమేకమై పాలనను సాగించాలని అన్నారు. ఈ విషయంలో సిఎం రేవంత్ రెడ్డి ని చూసి కెసిఆర్ నేర్చుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తాను పిసిసి అధ్యక్షుడైనా కార్యకర్తల్లో ఒకరిగా ఉంటానని చెప్పారు. హైడ్రా అనేది చారిత్రక నిర్ణయమన్న మహేష్‌కుమార్ గౌడ్ హైద్రాబాద్ అనేది రాక్స్ అండ్ లేక్స్ సిటీ అని, హైడ్రా ను హైద్రాబాద్ కు పరిమితం చెయ్యకూడదని, జిల్లాలకు విస్తరించాలన్నారు.

సంపద సృష్టిస్తున్నాం- ప్రజలకు పంచుతున్నాం : భట్టి
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సంపద సృష్టించి ప్రజలకు పంచుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన ప్రతి ఒక్కరికి సముచిత పదవులు, ప్రాధాన్యం ఇచ్చి గౌరవిస్తుందని ఇందుకు పిసిసి అధ్యక్షునిగా మహేశ్‌కుమార్‌గౌడ్ నియామకమే నిదర్శమని ఆయనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచే హామీలు అమలు ప్రారంభించామన్నారు. మహిళలకు ఆర్‌టిసిలో ఉచిత ప్రయాణం కోసం ప్రతి నెలా రూ.400 కోట్లు చెల్లిస్తున్నామనానరు. ఒకే విడతలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపించామని తెలిపారు. పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మహేష్ కుమార్ గౌడ్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నానన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి తీసుకు వెళ్లే విధంగా పిసిసి నూతన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. కాంగ్రెస్ శ్రేణులు తలెత్తుకునే విధంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అసెంబ్లీ ప్రాంగణంలో మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని ప్రారంభించామన్నారు. ఆరు గ్యారెంటీల హామీల అమలులో భాగంగా అర్హులైన ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందించే గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించామన్నారు. మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను సబ్సిడీపై అందిస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టబోతున్నాం. ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల వరకు లబ్ధిదారులకు ఇవ్వబోతోందన్నారు.

ప్రతి కార్యకర్త మిలిటెంట్‌గా పనిచేయాలి… ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఓబిసి నాయకుడు పిసిసి అధ్యక్ష పదవి చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ కు నా సంపూర్ణ మద్దతు ఉంటుందపి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కాబోతున్నారు. అందుకు ప్రతి కార్యకర్త మిలిటెంట్ గా పని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాటoలో బిజెపికి ఎలాంటి పాత్ర లేదని, సెప్టెంబర్ 17 పై బిజెపి ఏదేదో ప్రకటనలు చేస్తూ, పబ్బం గడుపుతోందని విమర్శించారు. తెలంగాణ భారత్ లో విలీనం అవడంలో, తాజాగా సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో బిజెపికి ఎలాంటి సంబంధం లేదని, బిజెపి కుట్రలను ప్రతి ఒక్క కార్యకర్త తిప్పికొట్టాలి, అందుకు సన్నద్ధం కావాలన్నారు.

కులగణన చేపట్టాలి …వి హెచ్.
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ పై గురుతర భాధ్యత ఉందని విహెచ్ అన్నారు. రాష్ట్రంలో వెంటనే కుల గణన చేయాలని సూచించారు. సెప్టెంబర్ 17 పోరాటానికి బిజెపికి సంబంధం లేదని అన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో కొత్త వాళ్ళతో పాటు పాత వాళ్లకు కూడా న్యాయం చేయాలని సూచించారు. పదేండ్ల లో కాంగ్రెస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని కోరారు. అంబేద్కర్ విగ్రహాన్ని పోలీస్ స్టేషన్ నుండి విడిపియ్యాలని, బిసిలు, బిసిలు కోట్టుకుంటే పిసిసి పదవి వేరే వాళ్లకు పోతుదని, అందుకే నేను మహేష్ కుమార్ గౌడ్ కు సపోర్ట్ చేసానన్నారు. రేవంత్ రెడ్డి నీకు దండం పెడుతున్న బిసి కుల గణన చేపట్టాలి అని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News