Wednesday, April 24, 2024

ఎంసెట్ ఉచిత కోచింగ్ అందించబోతున్న తెలంగాణ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీలలోని రెండో సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత ‘ఎంసెట్’ కోచింగ్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నుంచి ఈ కోచింగ్ అందించనున్నారు. ఇందుకు స్క్రీన్ టెస్ట్ కూడా చేపట్టనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఓ సర్య్కూలర్ జారీచేశారు. ప్రతి జిల్లాలో ఇందుకుగాను 50 మంది విద్యార్థులు, 50విద్యార్థినులను స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపికచేయనున్నారు.
ఈ కోచింగ్ కాకుండా జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ప్రతిభావంతులైన విద్యార్థులకు ‘ఇంటెన్సివ్ రెసిడెన్సియల్ సమ్మర్ కోచింగ్’ నిర్వహించనున్నారు. కాగా రెసిడెన్సియల్ కోచింగ్ 2023 ఏప్రిల్ నుంచి మే వరకు నిర్వహించనున్నారు.

ఎంసెట్ ఉచిత కోచింగ్ కోసం అర్హులైన ఎంపిసి, బైపిసి విద్యార్థులను గుర్తించేందుకు తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఆదేశాలు జారీచేయనున్నారు. జనవరి, ఫిబ్రవరి కోచింగ్ టైమింగ్, వసతులను జిల్లా అధికారులు ఖరారు చేయనున్నారు. రెసిడెన్సియల్ కోచింగ్ ముఖ్యంగా మోడల్ స్కూల్స్, రెసిడెన్సియల్ ఇనిస్టిట్యూట్స్, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ(టిఎంఆర్‌ఈఐఎస్)లలో నిర్వహించనున్నారు.

ప్రతి ఏడాది తెలంగాణ ఉన్నత విద్యా మండలి(టిఎస్‌సిహెచ్‌ఈ) తరఫున తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్సర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(టిఎస్ ఎంసెట్)ను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలిజికల్ యూనివర్సిటీ (జెఎన్‌టియూ) నిర్వహిస్తున్నది. ఇది ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్ష. ఈ ఏడాది ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏప్రిల్ 6న మొదలయింది. జూలై 18 నుంచి 30 వరకు మల్టీపుల్ సెషన్లలో వాటిని నిర్వహించారు.ప్రతిపాదిత ఉచిత ఎంసెట్ కోచింగ్ ప్రయివేట్ విద్యా సంస్థలలో చేరే తాహతు లేని వారికి చాలా ఉపయుక్తంగా ఉండనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News