- Advertisement -
బిఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర విమర్శలు చేశారు. బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎమ్మెల్సీ కవిత ఎందుకు బిసిలకు అండగా ఉండలేదని.. అధికారం పోయిన తర్వాత వారిపై ప్రేమ పుట్టుకొచ్చిందని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ కూడా గుర్తుకు రాలేదని విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని, కెసిఆర్.. రూ.8 లక్షల కోట్లు అప్పు ఆగం చేశారని ధ్యజమెత్తారు. రాహుల్ గాంధీ చెప్పిన మాట ప్రకారమే తెలంగాణలో పాలన సాగుతోందన్నారు.సిఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో రైతులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణలో చేసిన కులగణనే దేశానికి రోల్ మోడల్ అని ప్రభుత్వ విప్ అన్నారు. కాగా, దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
- Advertisement -