Sunday, May 12, 2024

ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం

- Advertisement -
- Advertisement -

కోడేరు : మండల పరిధిలోని నాగులపల్లి తాండలో నూతన గ్రామ పంచాయతి భవన నిర్మాణానికి ఎమ్మె ల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మంగళవారం భూమి పూజ చేసి ప నులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ సా ధనే లక్షంగా అహర్నిశలు శ్రమిస్తున్నారని, పల్లె ప్రగతి ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమని భావించి పల్లెలను అభివృద్ధి ది శగా పయణించేలా కృషి చేస్తున్నారని అన్నారు.

సిఎం కెసిఆర్ గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తు న్నారని, పల్లెల సర్వతోముఖాభివృద్ధే లక్షంగా బిఆర్‌ఎస్ ప్రభు త్వం పనిచేస్తుందన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగా ణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని వారు అన్నారు. తాండలో విద్యుత్ సమస్యలను పరిష్కరించామని, తండాకు బిటి రోడ్డు కూడా పూర్తి చేశామని, మిగిలిన రోడ్లను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తండాలో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరగా మంజూరు చేస్తానని హామి ఇచ్చారు.

ప్రతి గ్రామానికి, తండాకు సిఎంఆర్‌ఎఫ్, ఎల్‌ఓసిలు అందజేశా నని, నాగులపల్లి తండాకు సిఎంఆర్‌ఎఫ్ చెక్కులు ఇచ్చామని తెలిపారు. కోడేరు రైతు వేదిక దగ్గర వివిధ గ్రామాలకు చెందిన 37 మంది లబ్ధిదారులకు బిసి బంధు మొదటి విడత లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. కుల వృత్తులకు న మ్ముకున్న వారికి బిసి బంధు కొండంత అండగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒ క్కరికి అందజేస్తామని హామీ ఇచ్చారు.

దేశంలో ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌కె దక్కుతుందని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 20 మంది యువ కులు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అభివృద్ధికి ఆకర్షితులై బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి ఆధ్వ ర్యంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి, ఎంపి పి కొండ రాధా సుధాకర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ జగన్ మోహన్ రెడ్డి, మండల అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News