Wednesday, September 17, 2025

జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పి కొట్టాలి: రాజ్ నాథ్ సింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రజాకార్ల ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారని అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రాజ్ నాథ్ సింగ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పటేల్ సమర్థత వల్ల హైదరాబాద్ రాజ్యం భారత్ లో కలిసిందని, ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో గొప్ప ఘట్టం అని కొనియాడారు. సర్దార్ పటేల్ ముందు నిజాం తన ఓటమిని ఒప్పుకున్నారని, ఆపరేషన్ పోలో సర్దార్ పటేల్ ఎంతో ముందుచూపుతో వ్యవహరించారని ప్రశంసించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధర్మమార్గంలోనే నడుస్తామని, జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పి కొట్టాలని రాజ్ నాథ్ సింగ్ సూచించారు.

Also Read : ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది: రేవంత్ రెడ్డి

పటేల్ కలలు కన్న దేశాన్ని నిర్మించేందుకు భారత్ ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని, ఆర్టికల్ 370 తొలగించి జమ్ముకశ్మీర్ ను అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. మనలో ఎన్ని భేదాలున్నా దేశం విషయంలో అందరిదీ ఒకటే మాటని, దేశ రక్షణ, భద్రత విషయంలో ప్రజలంతా ఒక్కతాటికిపైకి వస్తామని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ లో మన సైనికులు సత్తా చాటారని, పహల్గాంలో మతం పేరు అడిగిమరీ చంపిన వారికి బుద్ధి చెప్పామని న్నారు. ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబ సభ్యులను హతమార్చామని, ఆపరేషన్ సిందూర్ తో భారత్ శక్తిసామర్థ్యాలు, సైనిక సత్తాను ప్రపంచం చూసిందని ప్రశంసించారు. ఉగ్రవాదుల స్థావరాల్లోకి వెళ్లి మరీ వారిని హతమార్చామని గర్వాన్ని వ్యక్తం చేశారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నామని తెలుసుకోవాలని, ఇవాళ భారత్ అంటే సాదాసీదా దేశం కాదని, ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటున్నాం అని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News