Wednesday, October 9, 2024

బలిదానాలు, త్యాగాలతోనే తెలంగాణకు స్వాతంత్య్రం: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నియంతృత్వ నిజాం నుంచి ప్రజలకు విమోచన లభించిన రోజు ఇది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజలు ఘనంగా జరిపారు. పరేడ్ మైదానంలో జాతీయ జెండాను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. అమరజవాన్లు స్తూపం, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిజాంపై వేల మంది ప్రజలు విరోచితంగా పోరాటం చేశారని కొనియాడారు. ప్రజల బలిదానాలు, త్యాగాల తరువాత తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. రజకార్ల మెడలు వంచడంలో దివంగత మాజీ ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్‌ది సాహసోపేత పాత్ర అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రజాకార్ల వారసత్వ పార్టీకి కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు కొమ్ముకాస్తున్నాయని దుయ్యబట్టారు. భర్కత్ పురలోని  బిజెపి రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో  కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News